జూ ఎన్టీఆర్ కి దమ్ము సరిపోదని ‘టైగర్’ని చేశారు...!
క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కెయస్ రామారావు నిర్మిస్తున్న జూ ఎన్టీఆర్ నటించే మలి చిత్రానికి 'టైగర్" అనే టైటిల్ పరిశీలనలో ఉందని వార్తలొస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'దమ్ము", 'చురకత్తి"అనే టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నాయి. 'సింహా" తర్వతా బోయపాటి మరో పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేశాడని, ఈ చిత్రంతో ఎన్టీఆర్ ఖచ్చితంగా పెద్ద హిట్టు కొడతాడని అంటున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం సురేందర్ డైరెక్షన్ లో ఊసరవెల్లి సినిమా చేస్తున్న ఎన్టీఆర్..బోయపాటి చిత్రాన్ని కూడా ఇదే ఏడాదిలో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఊసరవెల్లి ఆగస్ట్ లో, ఒకవేళ కాస్త లేటయితే బోయపాటి సినిమా సంక్రాంతికి విడుదలవుతాయట. ఇదిలావుంటే ఎన్టీఆర్ కొత్త సినిమా శక్తికి టాక్ చాలా వీక్ గా వుంది మరి ఈ టాక్ తో ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఎంతవరకు నిటబెడతాడో చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











