జూ ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ చిత్రం ప్రారంభం ఎప్పుడంటే...
బాలకృష్ణతో సింహా వంటి సూపర్ హిట్ చిత్రం ఇచ్చి 2010 లో స్టార్ డైరక్టర్ గా నిలిచిన బోయపాటి శ్రీను తాజాగా ఎన్టీఆర్ తో చిత్రం చేయటానికి కమిటైన సంగతి తెలిసిందే. అయితే బోయపాటి చెప్పిన కథలేమీ ఎన్టీఆర్ కి నచ్చకపోవటంతో చిత్రం ప్రారంభం కాకుండా వాయిదా పడింది. అయితే రీసెంట్ గా బోయపాటి చెప్పిన కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చింది.
దాంతో ఈ చిత్రం మార్చి నుంచి షూటింగ్ ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంభందించిన పూర్తి ప్రకటన త్వరలో విడుదల చేయాలని నిర్మాత కె.ఎస్.రామారావు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం అశ్వనీదత్ నిర్మించే 'శక్తి' చిత్రంలో నటిస్తున్నారు. అలాగే సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రచ్చ చిత్రం కూడా ఈ మధ్యనే లాంఛనంగా మొదలైంది.
జూ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను సింహా బాలకృష్ణ బృందావనం దిల్ రాజు jr ntr boyapati srinu simha bala krishna brindavanam dil raju


Click it and Unblock the Notifications