దసరా రోజున జూ ఎన్టీఆర్ సింహా గర్జన...!?

By Sindhu

విజయదశమి(దసరా)రోజున ఎన్టీఆర్ సింహ గర్జనకు రంగం సిద్దమవుతోంది. అది ఎలాగంటే 'సింహా" తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ బేనర్ పై కె.ఎస్ రామారావు నిర్మాతగా రూపొందనున్న ఎన్టీఆర్ తదుపరి చిత్ర ప్రారంభోత్సవాన్ని దసరా రోజు జరుపనున్నారు. నందమూరి నట 'సింహా"న్ని అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా చూపినట్టే నందమూరి యంగ్ టైగర్ ని అందరి ఊహలనూ తలదన్నే రీతిలో తెరపైకి తీసుకువచ్చేలా ఆ చిత్ర కథను తయారు చేయడంలో నిమగ్నమై వున్నారు బోయపాటి శ్రీను. కాగా 'బృందావనం" వర్క్ కంప్లీట్ కాగానే ఓ వైపు 'శక్తి" షూటింగ్ చేస్తూ..మరోవైపు బోయపాటితో కథా చర్చల్లో పాల్గొనబోతున్నాడు జూ ఎన్టీఆర్. ఆల్ రెడీ భంద్ర, తులసి మరియు సింహా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన బోయపాటి జూ ఎన్టీఆర్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందుంతుందని జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ లో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X