ఎన్టీఆర్ 'బృందావనం'కు గుమ్మడికాయ కొట్టేసారు
ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న బృందావనం చిత్రం షూటింగ్ నిన్న(మంగళవారం) సాయింత్రంతో పూర్తయింది. ఈ సందర్భంగా గుమ్మడికాయ కొట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్ళటానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇక నిన్న ఎన్టీఆర్, సమంత, ప్రకాష్ రాజ్ ల కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ప్యాచ్ వర్క్ తో సహా షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని సమాచారం. మొన్న ఆదివారం విడుదలైన ఆడియో అంతటా మంచి క్రేజ్ తెచ్చుకుంది. మాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఛోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫర్ గా చేసారు. ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
జూ ఎన్టీఆర్ బృందావనం కాజల్ సమంత వంశీ పైడిపల్లి దిల్ రాజు తమన్ jr ntr kajal samantha brindavanam vamsy paidipally dil raju


Click it and Unblock the Notifications