జూ ఎన్టీఆర్ ‘బృందావనం’ ఇంట్రడక్షన్ సీన్ ‘అదుర్స్’...
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం 'బృందావనం" కోసం ప్రస్తుతం చివరి పాట చిత్రీకరణ ఫారిన్ లో జరుగుతోంది. మరోవైపు హైదరాబాద్ లో శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం పై ల్యాబ్ రిపోర్ట్స్ చాలా పాజిటివ్ గా వినిపిస్తుండడం విశేషం. ముఖ్యంగా 'బృందావనం" లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిందని అంటున్నారు పోస్ట్ ప్రొడక్షన్ లో పాల్గొన్నవారు. ఇప్పటి వరకు ఇటువంటి హీరో ఎంట్రీ చూడలేదని తమ బంధువులకు ఫోన్ చేసి మరి చెప్పుకుంటున్నారట.
అంతేకాదండోయ్..ప్రతీ కీలక సన్నివేశంలోనూ ఎన్టీఆర్ ఎంట్రీని ఇంట్రడక్షన్ సీన్ లెవెల్ లోనే మలిచారట దర్శకుడు వంశీ. అన్నట్టు తన తొలి చిత్రం 'మున్నా" లోనూ ఏ సీన్ కా సీన్ ని హీరోయిజం ఎస్టాబ్లిష్ మెంట్ కే వాడుకున్న వంశీ అదే రిఫీట్ ని ఇక్కడా రిపీట్ చేసుకుంటే ఓకే కానీ అదే రిజల్ట్ రిపీట్ కాకుండా చూసుకునుంటే చాలు..అని సినిమా విమర్శకులు. మరో ప్రక్క ఇదంతా సినిమా ప్రచారం కోసం చేస్తున్నదే అని కాకుండా..నిజంగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు అబ్బురపరిచేలా..అత్యద్భుతంగా ఉంటాయని నిర్మాత దిల్ రాజు తో పాటు ఎన్టీఆర్ కూడా అంటున్నారు. చిత్రంలో విషయం లేకపోతే..ఎన్టీఆర్ ఆ పని చేస్తాడా..! పై మాటలు విన్న ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అప్పుడే లెక్కలు కూడా వేసుకుంటున్నారు...


Click it and Unblock the Notifications











