బాచ్ పల్లిలో జూ ఎన్టీఆర్ ఇల్లు కరీదు రెండున్నర కోట్లు..!
జూ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'దిల్" రాజు నిర్మిస్తున్న చిత్రం 'బృందావనం". కాజల్, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం కోసం నాలుగెకరాల్లో హైదరాబాద్ లోని బాచ్ పల్లిలో ఓ ఇంటి సెట్ వేశారు. బహుశా సినిమాలో ఇది ఎన్టీఆర్ ఇల్లు అయ్యుంటుంది. మూడెకరాల విస్తీర్ణంలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో ఈ ఇంటి సెట్ నిర్మాణం జరిగిందట. మిగతా ఒక ఎకరంలో కృత్రిమ గార్డెన్ తయారు చేశారట. ఈ సెట్ కు అయిన ఖరీదు రెండున్నర కోట్లు అని సమాచారం. ఈ చిత్రానికి సంబందించిన 60శాతం షూటింగ్ ని ఇందులో చేయడానికి ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయాలనుకుంటున్నారు.
జూ ఎన్టీఆర్ కాజల్ సమంత బృందావనం దిల్ రాజు వంశీ పైడిపల్లి jr ntr kajal samantha brindavanam dil raju vamsi paidipalli


Click it and Unblock the Notifications