జూ ఎన్టీఆర్ అందులో క్లిక్ అవుతాడా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'కంత్రి" విడుదలై ఒకటిన్నర సంవత్సరం అయ్యింది. అంత గ్యాప్ వచ్చినప్పటికీ రానున్న 'అదుర్స్" చిత్రం అదిరిపోయేలా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వుండేలా ఎన్టీఆర్ వినయ్ లు తగు జాగత్రలు తీసుకుంటుటన్నారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
గతంలో ఎన్టీఆర్ 'ఆంధ్రావాలా" చిత్రంలో డ్యూయెల్ రోల్ చేశారు. కాకపోతే అందులో కలిసి చేసిన సన్నివేశాలు లేవు. 'అదుర్స్" లో మాత్రం అలాంటి సన్నివేశాలకు బాగా స్కోప్ ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ గతంలో మాదిరి కాకుండా ద్విపాత్రాభినయం విషయంలో ఈసారైనా ఎన్టీఆర్ క్లిక్ అవుతాడో?లేడో? డిసెంబర్ 18 వరకు వేచి చూడాల్సిందే మరి.
అదుర్స్ జూ ఎన్టీఆర్ నయనతార కంత్రి ఆంధ్రావాలా ద్విపాత్రాభినయం adurs jr ntr nayantara kantri andhrawala dual role


Click it and Unblock the Notifications