అదీ జూ ఎన్టీఆర్ అంటే...(పుట్టిన రోజు స్పెషల్)
సీనియర్ ఎన్టీఆర్ మనవడైన జూ ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ రోజు(గురువారం). హైదరాబాద్ లోని సైబర్ గార్డెన్స్ ప్రాంగణంలో అభిమానుల సమక్షంలో జన్మదిన వేడుకల్ని నిర్వహించుటానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ వేడుకల్లో తన కొత్త చిత్రాల సంగతుల్ని చెబుతారు ఎన్టీఆర్. ఉత్సవంగా జరిగే ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొంటారు. ఇక తమ అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాలనే ఉత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను బంగారు కిరీటంతో సత్కరించడానికి అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుట్టిన రోజును పురస్కరించుకుని..సమాజ సేవలో అభిమానులనూ భాగస్వాములను చేసే విశిష్ట కార్యక్రమాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.
మే 20, 1982 పుట్టిన ఈ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్టుగా బ్రహ్మర్షి విశ్వామిత్రలో నటించారు. రెండో చిత్రానికే తాత వారసత్వం నిలబెడుతూ శ్రీరాముడుగా గుణశేఖర్ దర్శకత్వంలో బాల రామాయణంలో కన్పించి పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న సామెత నిజం చేసారు. కొద్ది సంవత్సరాలకు నిన్ను చూడాలని ఉంది (2001)లో ఓ యావరేజ్ చిత్రంతో పూర్తి స్ధాయి హీరోగా తెరంగ్రేటం చేసారు. అక్కడనుంచి తిరుగులేకుండా స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, ఆది, సుబ్బు, నాగ, ఆంధ్రావాలా, సాంబ అంటూ విభిన్నమైన సబ్జెక్టులతో ముందుకొచ్చారు. ఆంధ్రావాలా, నాగ, సుబ్బు వంటి చిత్రాలు నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఎన్టీఆర్ ఇమేజ్ మాత్రం పెరుగుతూనే వచ్చింది.
కృష్ణవంశీ రాఖీ చిత్రంతో మరో సారి భాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన ఎన్టీఆర్ యమదొంగ, కంత్రి, అదుర్స్ చిత్రాలతో సక్సెస్ ను కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం బృందావనం, శక్తి చిత్రాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రం చేయటానికి కమిట్ అయ్యారు. త్వరలో పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో మరో చిత్రం చేయనున్నారు. అలాగే బ్యాచులర్ గా ఎన్టీఆర్ కిది ఆఖరి బర్తడే కావటం మరో విశేషం. ఇక వరస హిట్లుతో చెలరేగిపోతున్న ఎన్టీఆర్ ఇలా మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ధట్స్ తెలుగు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











