పదేళ్ళ జూ ఎన్టీఆర్ విజయోత్సాహం...అభినందనలు
జూ ఎన్టీఆర్ హీరో గా కెరీర్ ప్రారంభించి పదేళ్ళు అయింది. నవంబర్ 16, 2000లో ఉషాకిరణ్ వారి నిన్ను చూడాలని చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. మే 23, 2001న విడుదల అయింది. ఈ పదేళ్ళలో ఎన్టీఆర్ స్టార్ డమ్ ని దాటి ఎదిగిపోయాడు. నిన్ను చూడాలని చిత్రం నుండి నిన్నటి బృందావనం వరకూ 17 చిత్రాలు దిగ్విజయంగా పూర్తి చేసాడు. ఫ్లాప్ లు వచ్చినప్పుడు క్రుంగిపోకుండా హిట్ లు వచ్చినప్పుడు పొంగిపోకుండా నిలకడగా నటనా కెరీర్ ని నడిపిస్తూ ఆది, సింహాద్రి, యమదొంగ వంటి బ్లాక్ బస్టర్స్ ని తన కెరీర్ లో వేసుకున్నాడు. ఈ విషయమై ఎన్టీఆర్ మాట్లాడుతూ...నాకు చాలా ఆనందంగా ఉంది. స్టార్ గా దాదాపు పదేళ్ళు పూర్తి చేసుకున్నాను. ఈ విజయం అంతా నా అభిమానులకే చెందుతుంది అన్నారు. ఎన్టీఆర్ ఇలాగే మరిన్ని దశాబ్దాలు పాటు ముందుకు దూసుకు వెళ్ళాలని నటుడుగా మరింత ఎత్తులుకు ఎదగాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.
More from Filmibeat
జూ ఎన్టీఆర్ బృందావనం ఆది సింహాద్రి యమదొంగ నిన్ను చూడాలని jr ntr brindavanam aadi simhadri yamadonga ninu chodalani


Click it and Unblock the Notifications











