బాలయ్యతో ఎన్టీఆర్‌కు విభేదాలు.. ఒకే ఒక్క ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చిన నందమూరి హీరో.!
ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతగానో సేవలు అందించారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తర్వాత నందమూరి బాలకృష్ణ ఆ బాధ్యతను తీసుకున్నారు. ఈ క్రమంలోనే దాదాపు నలభై ఏళ్లుగా ఆయన సినిమాల్లో నటిస్తున్నారు. ఇక, మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్ తన తాతను గుర్తు చేస్తున్నాడు. అన్నింట్లోనూ రాణిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. తాజాగా తారక్.. తన బాబాయ్ బాలయ్యకు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

సూపర్ ఫామ్‌లో ఎన్టీఆర్.. రికార్డుకు చేరువ
కొన్నేళ్ల క్రితం వరకూ వరుస పరాజయాలతో సతమతం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే వచ్చిన ‘టెంపర్' సినిమా అతడి కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. అప్పటి నుంచి తారక్ నటించిన ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత' సూపర్ హిట్ అయ్యాయి. దీంతో వరుసగా ఐదు హిట్‌లు సాధించి డబుల్ హ్యాట్రిక్‌కు చేరువయ్యాడు ఈ నందమూరి హీరో.

రియల్ హీరోగా మారిన నందమూరి హీరో
వరుస విజయాలతో దూసుకుపోతోన్న జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR' అనే చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో తారక్.. కొమరం భీంగా కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా జనవరి 8, 2021న ప్రేక్షకుల ముందుకు రానుంది.

లాక్‌డౌన్‌లో వర్క్ ఫ్రం హోమ్‌తో ఫుల్ బిజీ
కరోనా వైరస్ ప్రభావంతో కొద్ది రోజులుగా షూటింగ్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న RRR డబ్బింగ్ చెప్పుకోవడం కోసం ఇంట్లో ఉండి మలయాళం భాషను నేర్చుకుంటున్నాడు. అలాగే, ఇప్పటి వరకు పూర్తయిన షూటింగ్‌కు సంబంధించిన డబ్బింగ్ పనులను ఇంట్లో నుంచే పూర్తి చేస్తున్నాడని తెలుస్తోంది.

ఎన్టీఆర్‌కు ఊహించని పని చెప్పిన జక్కన్న
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇటీవల ‘అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎన్నారై కమ్యూనిటీ కోసం ‘బీ ది రియల్ మ్యాన్' అనే ఛాలెంజ్ తీసుకొచ్చారు. అంటే ఇంట్లో భార్యకు సాయం చేసిన వాడే నిజమైన మనిషి అని అర్థం. దీన్ని ఆయన రాజమౌళికి సవాల్ చేశారు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించి పూర్తి చేసిన జక్కన్న.. జూనియర్ ఎన్టీఆర్, చరణ్ సహా పలువురిని నామినేట్ చేశారు.
ఇప్పటి వరకూ చూడని ఎన్టీఆర్.. వీడియో రిలీజ్
రాజమౌళి చేసిన సవాల్‌ను జూనియర్ ఎన్టీఆర్ స్వీకరించాడు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్‌లో ‘ఛాలెంజ్ స్వీకరిస్తున్నా జక్కన్న' అంటూ ట్వీటాడు. దీంతో తారక్ ఏం చేస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తారక్ ఛాలెంజ్ కంప్లీట్ అంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో ఇంటిని శుభ్రం చేయడం.. గిన్నెలు కడగడం.. గార్డెన్ క్లీన్ చేయడం కనిపించింది.

బాలయ్యకు ఎన్టీఆర్ ఓపెన్ ఛాలెంజ్.. వాళ్లకు కూడా
రాజమౌళి విసిరిన సవాల్‌ను పూర్తి చేసిన తారక్.. ‘మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం' అంటూ ట్వీట్ చేశాడు. అలాగే, ఈ ఛాలెంజ్‌కు తన బాబాయ్ నందమూరి బాలకృష్ణతో పాటు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌తో పాటు డైరెక్టర్ కొరటాల శివను నామినేట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Recommended Video

నందమూరి ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్.!
చాలా రోజులుగా బాలకృష్ణ.. ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ‘అరవింద సమేత' సక్సెస్ మీట్‌కు బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేయడంతో ఆ వార్తలకు పుల్‌స్టాప్ పడిపోయింది. ఆ తర్వాత తారక్ కూడా ‘యన్.టి.ఆర్' బయోపిక్ ఫంక్షన్‌కు వచ్చాడు. ఇప్పుడు తారక్ ట్వీట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











