ఎన్టీఆర్ 70 సార్లు బట్టలిప్పేశాడు.. రాశీ, నివేదా నోట షాకింగ్ న్యూస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జైలవకుశ. ఈ చిత్రం ఈ నెల 21వ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. జైలవకుశలో ఎన్టీఆర్ సరసన రాశిఖన్నా, నివేదిత థామస్ నటించారు. అయితే హీరో, ఇద్దరు హీరోయ
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జైలవకుశ. ఈ చిత్రం ఈ నెల 21వ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. జైలవకుశలో ఎన్టీఆర్ సరసన రాశిఖన్నా, నివేదిత థామస్ నటించారు. అయితే హీరో, ఇద్దరు హీరోయిన్లు ప్రస్తుతం చిత్ర ప్రమోషన్ లో యమా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిరువురు ఎన్టీఆర్ గురించి చెప్పిన పలు ఆసక్తికర విషయాలు ఏమిటంటే..

ఎన్టీఆర్ గురించి రాశీ...
ఈ చిత్రంలో మూడు పాత్రలు అది కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేదని వివిధ రకాలైన పాత్రలు చేయడం కష్టంతో కూడుకున్నదని రాశీఖన్నా పేర్కొన్నారు. జైలవకుశ చిత్రంలో హీరోయిన్ గా చేయడం గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పారు. గతంలో తాను చేసిన అన్ని చిత్రాలు ఓ ఎత్తు అయితే ఈ చిత్రం మాత్రం ఓ ఎత్తు అని ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ పై అయితే రాశీ ప్రశంసల జల్లు కురిపించారు. మనమంతా సూర్పిగా తీసుకోవాల్సిన నటుడు ఎన్టీఆర్ అంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు.

తారక్ గురించి మాటల్లో చెప్పలేం...
నివేదితా మాట్లాడుతూ... తాను తెలుగులో చేసిన మూడో చిత్రం జైలవకుశ అని చెప్పారు. తారక్ అశీస్సులతోనే తాను ఈ చిత్రంలో నటించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు తారక్ గురించి మాట్లాడుతూంటే ఆయన ఏంటో ఇప్పుడు అర్థమవుతుందన్నారు. ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలు నేను చూసిన మాటల్లో చెప్పలేను. ఎన్టీఆర్ హార్డ్ వర్క్, డెడికేషన్ చూస్తే మతి పోయింది. నిజంగా ఆయన గ్రేట్.

70 సార్లు కాస్ట్యూమ్స్...
ఎన్టీఆర్ గురించి ఈ ఇద్దరు అందాల భామలు చెప్పిన ఆసక్తికరమైన విషయాం ఏమిటంటే... జైలవకుశ షూటింగ్ సమయంలో సెట్ లో దాదాపు 70 కాస్ట్యూమ్స్ మార్చుకున్నారని చెప్పారు. త్రిపాత్రాభినయంలో నటించిన ఆయన పాత్ర పాత్రకు కాస్ట్యూమ్స్ మార్చుకోవడం అంటే మామూలుు విషయం కాదన్నారు. ఇక్కడే తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో అని వారు పేర్కొన్నారు.

ఆనందంలో అభిమానులు..
ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించడం ఇదే మొదటిసారి. ఈ చిత్రంపై ఆయన ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై ఇప్పటికే వచ్చిన ట్రైయిలర్ లో ఎన్టీఆర్ మూడు పాత్రల పట్ల ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అదికాక చిత్రంలో విలన్ పాత్ర అయిన జై పట్ల తీవ్ర ఆసక్తికరంగా ఉన్నారు.

ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...
ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 21న విడుదల అవుతుండగా... ప్రిన్స్ మహేష్ బాబు నటించి స్పైడర్ సరిగ్గా వారానికి అంటే సెప్టెంబర్ 27న విడుదల అవుతుంది. దీంతో ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు చిత్ర పరిశ్రమ అంతా ఈ రెండు చిత్రాల విడుదలపైన ఆసక్తిగా ఎదురు చూస్తుంది.


Click it and Unblock the Notifications











