'ఊసరవెల్లి'లో ఎన్టీఆర్ క్యారక్టైరేజేషన్
సురేంద్రరెడ్డి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ హీరోగా 'ఊసరవెల్లి'టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర విలక్షణంగా ఉంటుందని సురేంద్ర రెడ్డి చెప్తున్నారు. ఆయన పాత్ర గురించి చెబుతూ..యుద్ధంలో గెలవాలంటే రెండే రెండు మార్గాలు. బలం, బలగం సరిపోతాయి అనుకొంటే సైనికుడై దూకాలి. అవి చాలని పక్షంలో మెదడుకు పదును పెట్టాలి. పరిస్థితిని బట్టి మారాలి... అవసరమైతే శత్రువులను ఏమార్చాలి. మా కథానాయకుడు రెండో మార్గాన్నే ఎంచుకొన్నాడు. మరి రణ రంగంలో వీరుడై ఎలా నిలిచాడో తెలియాలంటే ఎన్టీఆర్ కొత్త చిత్రం వచ్చే వరకూ ఆగాల్సిందే అన్నారు.
తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఫైటింగ్ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. ఇక నిర్మాత ఈ చిత్రం గురించి చెబుతూ..ప్రత్యర్థులను చిత్తుచేసే ఎత్తులు వేయడమే కాదు... ఎదుటి వారి ఆలోచనలను కూడా పసిగట్టేవాడే చదరంగంలో గెలవగలడు. అలాంటి ఓ యువకుడు తన లక్ష్యం కోసం రంగంలో దిగాడు. ఇంతకీ ఆ లక్ష్యమేంటి? దాన్ని ఎలా సాధించాడు అనేది తెర మీదే చూడాలి. ఎన్టీఆర్ పాత్ర చిత్రణ కొత్తగా ఉంటుంది. అటు మాస్‌నీ, ఇటు యువతనీ ఆకట్టుకొనేలా కథ, కథనాలుంటాయ అన్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు ఎనభై శాతం పూర్తయింది. దసరాకు విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











