వాళ్లని తట్టుకోవడం ఎన్టీఆర్, చరణ్‌లకు సాధ్యమా?
తెలుగు సినీ పరిశ్రమలో తమ మార్కుని చాటు కోవడానికి యువహీరోలంతా తమ శక్తిమేర కష్ట పడుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలు నటన, డైలాగ్ డెలివరీతో పాటు అభిమానులు ఎంతగానో ఇష్టపడే డాన్స్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న వారిలో డాన్స్ బాగా చేసే హీరోలు ఎవరంటే ముఖ్యంగా వినిపించేది నలుగురి పేర్లు. జూ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్. కష్టసాధ్యమైన స్టెప్పులను కూడా అవలీలగా చేయగలిగే సత్తా ఉన్న హీరోలు వీరు మాత్రమే. అభిమానులకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపెట్టాలనే తమనతో ఈ హీరోలు పలు సందర్భాల్లో గాయాలపాలయ్యారు కూడా...
ప్రస్తుతం ఈ నలుగురు హీరోలు నటించిన సినిమాలు సమ్మర్ బరిలోకి వచ్చాయి. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన 'రచ్చ', జూ ఎన్టీఆర్ నటించిన 'దమ్ము' చిత్రాలు విడుదలయ్యాయి. 'రచ్చ'లో రామ్ చరణ్ డాన్స్ విషయంలో ఇరగదీశాడు. అయితే 'దమ్ము'లో ఎన్టీఆర్ స్టెప్పులు ఏమంత బాగోలేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అయితే త్వరలో 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎనర్జిటిక్ హీరో రామ్, 'జులాయి' చిత్రంతో తన సత్తా చూపడానికి వస్తున్న అల్లు అర్జున్....డాన్స్ ల పరంగా కేక పుట్టించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో వీరి పెర్పార్మెన్స్ ఓ రేంజ్ లో ఉండబోతోందని అంటున్నారు.
అదే జరిగితే రచ్చ, దమ్ము చిత్రాల్లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల ప్రదర్శన........అల్లు అర్జున్, రామ్ జోరుకు వెలవెల పోక తప్పదనే వాదన వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











