HappyBirthdayNBK: బాలకృష్ణకు ఎన్టీఆర్, మహేశ్ స్పెషల్ విషెస్.. మెగా హీరోలు ఇలా.. హీరోయిన్లు అలా!

దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి.. మైలురాళ్లను చేరుకుని.. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక, ఈరోజు బాలయ్య 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

బాబాయికి ఎన్టీఆర్ స్పెషల్ విషెస్

బాబాయికి ఎన్టీఆర్ స్పెషల్ విషెస్

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ 'జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్. మీరు అన్ని వేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. 61వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి 90 దశకం నాటి బాలకృష్ణ ఫొటోను కూడా జత చేశాడు తారక్.

మిత్రుడికి చిరంజీవి శుభాకాంక్షలు

మిత్రుడికి చిరంజీవి శుభాకాంక్షలు

నటసింహా బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో 'మిత్రుడు బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ పోస్ట్ చేశారు. దీనికి మెగా అభిమానులతో పాటు నందమూరి ఫ్యాన్స్ నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది.

బాలయ్యకు మహేశ్ బాబు విషెస్

బాలయ్యకు మహేశ్ బాబు విషెస్

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌ ఖాతాలో 'పుట్టినరోజు శుభాకాంక్షలు బాలకృష్ణ గారు. మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఏడాది మీకెప్పటికీ గుర్తుండిపోవాలని ఆశిస్తున్నా' అంటూ రాసుకొచ్చాడు.

బాబాయికి కల్యాణ్ రామ్ విషెస్

బాబాయికి కల్యాణ్ రామ్ విషెస్

తన బాబాయి నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని కల్యాణ్ రామ్ ఓ పోస్ట్ చేశాడు. అందులో '61వ పుట్టినరోజు జరుపుకుంటోన్న మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్' అంటూ పేర్కొన్నాడు. అలాగే, బాలయ్యతో కలిసి దిగిన ఓ ఫొటోను కూడా దీనికి జత చేశాడు.

బాలయ్యకు సుప్రీమ్ హీరో ట్వీట్

బాలయ్యకు సుప్రీమ్ హీరో ట్వీట్

నటసింహా బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. అందులో 'ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా బాలకృష్ణ గారు. మీరెప్పుడూ ఆరోగ్యంగా, సక్సెస్‌ఫుల్‌‌గా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నా' అంటూ రాసుకొచ్చాడీ మెగా హీరో.

లెజెండ్ అంటూ ఈషా రెబ్బా ట్వీట్

లెజెండ్ అంటూ ఈషా రెబ్బా ట్వీట్

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఈషా రెబ్బా ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది. అందులో 'పుట్టినరోజు శుభాకాంక్షలు లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారూ' అంటూ పేర్కొంది. అలాగే, దీనికి ఆయన కామన్ డీపీని కూడా జత చేసింది. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది.

బాలకృష్ణకు విక్టరీ వెంకటేష్ విషెస్

బాలకృష్ణకు విక్టరీ వెంకటేష్ విషెస్

నటసింహా బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఖాతాలో 'డియర్ బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది శాంతియుతంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ అందులో పేర్కొన్నారు. ఈ మేరకు బాలయ్య ఫొటోను కూడా జత చేశారాయన.

బాలయ్యకు అనిల్ రావిపూడి ఇలా

బాలయ్యకు అనిల్ రావిపూడి ఇలా

నందమూరి హీరో బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని దర్శకుడు అనిల్ రావిపూడి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'నందమూరి నటసింహం బాలయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అఖండతో పాటు 107వ చిత్రం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే, మీకు విజయాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నా' అంటూ అందులో పేర్కొన్నాడు.

సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే, రాజకీయ వర్గాల నుంచి కూడా ఆయనకు విషెస్ వస్తున్నాయి. పార్టీలకతీతంగా ఎంతో మంది నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో నందమూరి బాలకృష్ణ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X