twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాలిటిక్స్ ఎంట్రీ గురించి జూ ఎన్టీఆర్

    By Srikanya
    |

    మా తాతగారు స్దాపించిన పార్టీ తెలుగు దేశం. అందుకే పార్టీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కార్యకర్తలా పని చేస్తాను. పరోక్షంగా నా సేవలు ఎప్పుడూ ఉంటాయి. ఇక ప్రత్యక్ష్యంగా అనేది ఎప్పుడో తెలీదు. ప్రస్తుతం నేను నా సినిమాలతో బిజీగా ఉన్నాను అన్నారు ఎన్టీఆర్. ఆయన్ని మీరు ప్రజా జీవితంలోకి ఎప్పుడు వస్తారు అని అడిగినప్పుడు ఇలా స్పందించారు. అలాగే తన వయస్సు ఇప్పుడు కేవలం 28 సంవత్సరాలేనని, ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నానని,తన బ్రతుకు తెరవు అయిన సినిమాల్లో ఇప్పుడు స్ధిరపడుతున్నానని అన్నారు. అలాగే రాజకీయాల్లోకి వస్తే మార్పు తెచ్చేలా రావాలనుకుంటున్నాని అన్నారు.ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవెల్లి ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ఊసరవెల్లి చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం బాగానే తెచ్చుకుంటోంది.

    ఇక ఊసరవెల్లి గురించి చెపుతూ...హీరోయిన్ మీద రన్ అయ్యే సినిమా అనేసరికి అందరికీ రిస్క్ అనే భావన వస్తుంది. కానీ నేను తొలిసారి వినగానే కథ బాగా నచ్చింది. అస్సలు హీరోయిన్ మీద నడవకపోతే కథలో కొత్తదనమేముంటుంది. లేడీస్ అందరూ ఈ కథకు అంత బాగా కనెక్టు అవుతున్నారంటే కారణం కథే. కాకపోతే టైటిల్ పరంగా కొంత ఆలోచించా అన్నారు. ఇక ఈ చిత్రం నా జీవితంలో ఇదో ప్రత్యేక చిత్రంగా మిగిలిపోతుంది. కథా పరంగా ఓ ప్రయోగం గా అనిపించింది. ఇంటర్వెల్ అయిన తర్వాత తమన్నా ప్లాష్ బ్యాక్ మొదలవుతుంది. దాదాపు ఇరవై నిముషాల సేపు హీరో కనపడడు. వాణిజ్య అంశాలు మేళవించిన చిత్రాల్లో ఇలాంటి ఎత్తుగడ ఓ ప్రయోగం ..ప్రమాదం అన్నారు. కానీ సురేంద్రరెడ్డి ఈ పాయింటు చెప్తున్నప్పుడు బాగా నచ్చి చేసాను అన్నారు. తన తదపరి చిత్రం టైటిల్ దమ్ము అని, ఆ చిత్రం ప్రేక్షకులకు విందు భోజనంలా ఉండబోతోందని అన్నారు.

    English summary
    Jr Ntr about his movies and political entry in Oosaravelli film promotion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X