తాత అడుగు జాడల్లోనే.. ప్రజలకు తిరిగి ఇచ్చేస్తా.. రాజకీయ ప్రవేశంపై నేషనల్ మీడియాకు ఎన్టీఆర్ క్లారిటీ
RRR మూవీ విజయం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు నీరాజనం పడుతున్నారు. ఎన్టీఆర్ 20 ఏళ్ల కెరీర్‌లో RRR చిత్రం ఓ మైలురాయిగా నిలిచింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకే తెలిసిన ఎన్టీఆర్ టాలెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ అభిమానులకు తెలిసిపోయింది. అయితే తనకు వారసత్వంగా లభించిన నటన, రాజకీయాలపై ఎన్టీఆర్ జాతీయ మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ తన రాజకీయ ఎంట్రీపై మీడియా అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పారంటే..

నందమూరి తారక రామారావు స్పూర్తి
నా జీవితానికి, బ్రతుకుకు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్పూర్తి. ఆయన సూపర్ స్టార్, దర్శకుడు, రాజకీయ నేత. మూడుసార్లు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 300కుపైగా చిత్రాల్లో నటించారు. మూడు జాతీయ అవార్డులను దక్కించుకొన్నారు. కేవలం సినీ నటుడే కాదు.. బాధ్యతాయుతమై దేశ పౌరుడు. ఆయన నటుడే అనేది కాకుండా దేశ పౌరుడనే విషయాన్ని ఆయన జీవితాన్ని చూస్తే తెలిసింది. రాజకీయాల్లోకి రాగానే పేదల కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టారు అని ఎన్టీఆర్ అన్నారు.

దేశానికి మంచి పౌరుడు ఎన్టీఆర్
మా తాతగారిని చూస్తే... ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు తీర్చుకొలేని విధంగా ప్రేమను పంచారు. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చి.. ప్రజలకు తనకు తాను ఏదో సమర్పించుకోవాలని అనుకొన్నారు. తిరిగి ఇవ్వడం ఆయన లక్షణం. దేశానికి మంచి పౌరుడిగా తన జీవితాన్ని అర్పించుకొన్నారు. ఆయన జీవితాన్ని గుర్తు చేసుకొన్నప్పుడల్లా ప్రజలకు తిరిగి ఇవ్వాలనే కోరిక వెంటాడుతుంటుంది. నాకు అభిమానులు ఎంతో ఇస్తున్నారు. విలువ కట్టలేని ప్రేమ, ఆదరణలో మునిగిపోతున్నాను. కానీ ఏదో రోజు వారికి తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంది అని ఎన్టీఆర్ చెప్పారు.

ప్రజలకు రుణం చెల్లించే విధంగా
ప్రజలకు, అభిమానులకు ఏ రూపంలో తిరిగి చెల్లించాలనేది? ఎప్పుడు చెల్లించాలనేది కాలమే సమాధానం చెబుతుంది. ప్రస్తుతానికి మంచి సినిమాల్లో నటించడం, మంచి పాత్రలు పోషించడంపైనే నా దృష్టి ఉంది. సమయం వచ్చినప్పడు నా తాత గారి అడుగు జాడల్లో నడుస్తుంటాను. నేను రుణపడి ఉన్న వాళ్లకు ఏదో సేవా రూపంలో వారికి తిరిగి ఇచ్చేస్తాను అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

రాజకీయాల్లోకి వస్తారా?
RRR సినిమా ప్రమోషన్‌లో భాగంగా జాతీయ మీడియాకు చెందిన వెబ్‌సైట్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయాల్లోకి మళ్లీ వస్తారా? అని ప్రశ్నిస్తే.. ప్రస్తుతం నా జీవితంలో ప్రస్తుతం అనుభవిస్తున్న క్షణాలతో కొత్త అనుభూతిని పొందుతున్నాను. జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నాను. నటుడిగా నేను ప్రతీ విజయాన్ని, ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనే అని ఎన్టీఆర్ అన్నారు.
Recommended Video


జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నా
జీవితం గురించి వేదాంత ధోరణిలో మాట్లాడుతూ.. జీవితమంటే మరో పదేళ్లు లేదా ఐదేళ్లు లెక్కించుకొనే పరిస్థితి లేదు. జీవితమంటే మరో సెకన్ అనే భ్రమల్లో ఉన్నాం. అందుకే ప్రతీ క్షణాన్ని నేను ఆస్వాదించడానికే ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నటుడిగా నాకు దక్కుతున్న ప్రేమ, ఆదరణతో సంతృప్తిగానే ఉన్నా. నేను చేసే పని నాకు పూర్తి సంతృప్తిని ఇస్తున్నది. అందుకే ప్రస్తుతం యాక్టింగ్‌కే పరిమితం కావాలని అనుకొంటున్నాను అని ఎన్టీఆర్ తెలిపారు.


Click it and Unblock the Notifications











