జూ ఎన్టీఆర్ హనీమూన్ ట్రిప్ తర్వాత బిజీ బిజీ....
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీప్రణతితో కలిసి హనీమూన్ కి వెళ్ళాడు. 15వ తారీఖున ఈ దంపతులు తిరిగి ఇండియా వచ్చేస్తున్నారు. 16 నుంచి ఎన్టీఆర్ రెగ్యులర్ గా షూటింగ్ లో పాలుపంచుకోనున్నాడని తెలుస్తోంది. 16 నుంచి మే నెలాఖరు వరకూ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో 'ఊసరవెల్లి" చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడట. ఊసరవెల్లిలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఆ తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ లో కెయస్ రామారావు నిర్మాణంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న 'చురకత్తి" చిత్రం షూటింగ్ తో ఎన్టీఆర్ బిజీగా ఉండబోతున్నాడని సమాచారం. ఈ చిత్రంలో శృతి హాసన్ ప్రదాన హీరోయిన్ గాను ప్రియమణి సెకండ్ హీరోయిన్ గాను నటించనున్నారు. ఈ రెండు చిత్రాల షెడ్యూల్స్ కంటిన్యూగా జరగనున్నాయట.
jr ntr lakshmi pranathi oosaravelli churakathi tamanna boyapati srinu జూ ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి ఊసరవెల్లి బోయపాటి శ్రీను చురకత్తి సురేంద్రరెడ్డి తమన్నా


Click it and Unblock the Notifications