NBK With NTR: బాలయ్యతో ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నందమూరి అభిమానులకు పండుగే
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఆ ఫ్యామిలీకి మూల పురుషుడు అయిన లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మాత్రమే కాదు.. ఆ కుటుంబం నుంచి ఎంతో మంది సినిమాల్లోకి ప్రవేశించారు. కానీ, వారిలో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రమే స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు.
ఇక, అభిమానులతో పాటు సినీ ప్రియులంతా నందమూరి హీరోల కాంబోలో మల్టీస్టారర్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై తారక్ క్లారిటీ ఇచ్చాడు. అభిమానులు పండుగ చేసుకునే విషయాన్ని చెప్పాడు. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

భారీ సక్సెస్ అందుకున్న బాలయ్య
కొంత కాలంగా వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతోన్న నందమూరి బాలకృష్ణ.. ‘అఖండ' మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. తద్వారా బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

సూపర్ ఫామ్‌లో జూనియర్ ఎన్టీఆర్
ఈ మధ్య కాలంలో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్' నుంచి వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగిందనే చెప్పుకోవాలి.

నందమూరి మల్టీస్టారర్ ఫిక్స్ అని
వాస్తవానికి నందమూరి కుటుంబ హీరోల మల్టీస్టారర్ మూవీ ఉంటుందని చాలా రోజులు ప్రచారం జరుగుతూనే ఉంది. బాలయ్య - ఎన్టీఆర్ కాంబోలో సినిమా వస్తుందని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాగే, బాలయ్య - కల్యాణ్ రామ్.. ఎన్టీఆర్ - కల్యాణ్ రామ్ సినిమాలు ఉంటాయని అన్నారు. కానీ, ఇవేమీ కార్యరూపం దాల్చకపోవడంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

బాలయ్య అలా.. తారక్ ఇలా బిజీగా
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న RRRలో నటించాడు. ఇందులో అతడు కొమరం భీం పాత్రను చేశాడు. దీని తర్వాత కొరటాల శివతో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్రమోషన్‌లో మల్టీస్టారర్‌పై ఓపెన్
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ RRR మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. మల్టీస్టారర్ మూవీల గురించి తన మనోగతాన్ని బయట పెట్టేశాడు. ‘మంచి కథతో దర్శకులు వస్తే ఫ్యూచర్‌లో కూడా మల్టీస్టారర్ మూవీలు చేస్తాను. అలాంటి ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధమే' అని పేర్కొన్నాడు.

బాలయ్యతో సినిమాపై తారక్ టాక్
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘ఫ్యూచర్‌లో జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీలు చేయాల్సి వస్తే ఏ హీరోతో చేయడానికి ఆసక్తి చూపిస్తారు' అని ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి ఈ స్టార్ హీరో ‘అందరితో చేయాలని ఉందండి. ముఖ్యంగా చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాల బాబాయ్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఎవరితోనైనా చేస్తాను' అంటూ సమాధానమిచ్చాడు.
Recommended Video


సినిమా చేస్తానని చెప్పిన ఎన్టీఆర్
తాజా ఇంటర్వ్యూలో తన బాబాయి బాలకృష్ణ మల్టీస్టారర్ చేయాలని ఉందని ఎన్టీఆర్ చెప్పడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు, త్వరలోనే వీళ్లిద్దరి కాంబోలో ఎవరైనా సినిమా చేయాలని కోరుకుంటున్నారు. ఇక, తాజాగా తారక్ చేసిన స్టేట్‌మెంట్‌తో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని పరోక్షంగా పేర్కొన్నాడు. ఇప్పుడిది హైలైట్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











