twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ కి బాణం గుచ్చుకుంటుందా?

    By Srikanya
    |

    జూ.ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరివిల్లి దసరా కి విడుదల కానున్న సంగతి తెలిసిందే.అయితే అప్పుడే బాలకృష్ణ శ్రీరామరాజ్యం విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే అనుకోని విధంగా గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తికాలేదంటూ శ్రీరామరాజ్యం చిత్రం వెనక్కి వెళ్ళింది.అయితే ఎన్టీఆర్ కి ఆ ఆనందం ఎంతో సేపు ఉంచేలా లేరు. అతనితో పోటీకి బాణంతో పాపులర్ అయిన నారా రోహిత్ పోటీకి దిగబోతున్నాడని తెలుస్తోంది. పరుశరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సోలో చిత్రంని కూడా దసరా కే రెడీ చేస్తున్నట్లు సమాచారం. నారా రోహిత్ ఇప్పుడు తన భార్య తరుపు బంధువు కూడా కావటంతో ఎన్టీఆర్ ఇబ్బందిపుడుతున్నాడని చెప్తున్నారు.

    యువత, ఆంజనేయులు చిత్రాలు రూపొందించిన పరుశురామ్ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఓ లవ్ స్టోరీ అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం కథ అమ్మాయి ఎవరో ఏంటో చూసుకోకుండా ప్రేమలో పడ్డ అబ్బాయికి ఆ తర్వాత పెద్దవాళ్ల ద్వారా సమస్యలు వస్తాయి. అప్పుడు హీరో తన ప్రేమ కోసం సోలో గా చేసే పోరాటమే చిత్ర కథాంశం. దర్శకుడు ఇదే విషయం చెపుతూ..ప్రేమ సమరంలో గెలవడానికి మా హీరో వేసిన ఎత్తులు ఎలాంటివో మా చిత్రంలో చూడాల్సిందే అంటున్నారు.వంశీకృ ష్ణ శ్రీనివాస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం కొంత టాకీ మినహా షూటింగ్ పూర్తయింది. నారా రోహిత్ సరసన నిషా అగర్వాల్‌ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, సాయాజీషిండే, అలీ, ఎమ్మెస్‌నారాయణ, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర పాత్రధారుల. సంగీతం: మణిశర్మ. మరి ఈ చిత్రం ఊసరవిల్లికి ఏ మాత్రం పోటీ ఇస్తుందో చూడాలి.

    English summary
    If Solo gets the Solid release in first two weeks of October, then a fight between Nara and Nandamuri heroes is inevitable.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X