శ్రీను వైట్లకు జూ ఎన్టీఆర్ కండీషన్!
బోయపాటితో 'దమ్ము' సినిమా తర్వాత జూ ఎన్టీఆర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 2012 ఫిబ్రవరిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తీన్ మార్ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని పరమేశ్వరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.
ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం....జూ ఎన్టీఆర్ శ్రీనువైట్లకు ఓ కండీషన్ పెట్టాడని తెలుస్తోంది. శ్రీను వైట్ల ఇది వరకు తీసిన 'దూకుడు' సినిమా హైలీ ఎంటర్ టైన్మెంట్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో తనకు అలాంటి సబ్జెక్టు కావాలని, ఆ సినిమాలో మాదిరి పంచ్ డైలాగులు, కామెడీ తన సినిమాలోనూ జొప్పించాలని చెప్పినట్లు చర్చించుకుంటున్నారు. అదే సయమంలో యాక్షన్ సన్నివేశాలు కూడా దుమ్మరేగాలని సూచనలు ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఎన్టీఆర్ కండీషన్ల ప్రకారమే కథలో కొన్ని మార్పులు చేసిన శ్రీను వైట్ల ఇటీవల స్ర్కిప్టును తయారు చేసుకున్నాడని, అది విన్న ఎన్టీఆర్ సంతృప్తి వ్యక్తం చేసి, సినిమా ఫైనల్ చేశాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











