ఆహుతి ప్రసాద్‌కు జూనియర్ ఎన్టీఆర్ నివాళి
హైదరాబాద్ : అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ భౌతికకాయానికి సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ తదితరులు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. సోమవారం ఎర్రగడ్డ శ్మశానవాటికలో ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు జరగనున్నాయి.
ఆహుతి ప్రసాద్ భౌతికకాయానికి సినీ నటులు శ్రీకాంత్, అలీ, శివాజీరాజా, బండ్ల గణేశ్, కాదంబరి కిరణ్‌కుమార్, సన, సురేఖ వాణి తదితరులు నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. అంతకుముందు ప్రసాద్ భౌతికకాయాన్ని కిమ్స్ ఆస్పత్రి నుంచి ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. సోమవారం ఎర్రగడ్డ శ్మశానవాటికలో ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు జరగనున్నాయి.

ఆహుతి ప్రసాద్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సినీ నటుడు, తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ, దాసరి నారాయణరావు, మోహన్‌బాబు తదితరులు సంతాపం ప్రకటించి ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆదివారం మధ్యాహ్నం కన్నుమూసిన ప్రముఖ సినీనటుడు ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ కార్యాలయానికి తరలిస్తారు. అనంతరం ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











