ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆఫీస్‌కి జూ. ఎన్టీఆర్.. అన్నయ్య కోసం వెళ్లి!
నందమూరి కళ్యాణ్ రామ్ కు చాలాకాలం తర్వాత పటాస్ చిత్రంతో హిట్ దక్కింది. కానీ ఆ జోరు ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. ఇక గత ఏడాది అయితే ఎమ్మెల్యే, నా నువ్వే లాంటి చిత్రాలుకళ్యాణ్ రామ్ కు మరింతగా నిరాశని మిగిల్చాయి. దీనితో కళ్యాణ్ రామ్ తన కెరీర్ ని నిలబెట్టుకోవాలంటే 118 చిత్రం విజయం సాధించడం చాలా కీలకం. 118 చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని తొలి షో నుంచే పాజిటివ్ టాక్ ప్రారంభమైంది. 118 చిత్రం విజయం సాధించిన సందర్భంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అప్పుడే చెప్పాడు
118 చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ కూడా అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 118 చిత్రం కళ్యాణ్ రామ్ అన్న కెరీర్ లో బెస్ట్ మూవీ గా నిలిచిపోతుందని తెలిపాడు. ఈ చిత్రాన్ని ఆల్రెడీ తాను చూశానని ఎన్టీఆర్ తెలిపాడు. ముఖ్యంగా నివేద థామస్ నటనకు ఓ సన్నివేశంలో తన కళ్ళు చెమర్చాయని ఎన్టీఆర్ తెలిపాడు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆఫీస్‌కి
118 చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా తన సోదరుడికి కంగ్రాట్స్ చెప్పడానికి జూ.ఎన్టీఆర్ స్వయంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య అనుబంధం మరోమారు బయటపడిందని అంటున్నారు. కాసేపు వీళ్ళిద్దరూ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆఫీస్ లోనే ముచ్చటించుకున్నారట.

రూటు మార్చాడు
వరుసగా కళ్యాణ్ రామ్ చేసిన కమర్షియల్ చిత్రాలు వరుసగా నిరపరిచాయి. దీనితో 118 తో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ని ఎంచుకున్నాడు. ప్రముఖ కెమెరామెన్ కెవి గుహన్ దర్శకుడిగా ఇది డెబ్యూ మూవీ. 118 చిత్రం ఆసక్తికరంగా చిత్రీకరించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడనే ప్రశంసలు దక్కుతున్నాయి. నివేద థామస్, షాలిని పాండే కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్లుగా నటించారు.

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
118 చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో చిత్రయూనిట్ మీడియా సమావేశంలో తమ సంతోషాన్ని పంచుకున్నారు. 118 చిత్రంతో కొత్త ప్రయత్నం చేశా. ప్రేక్షకులను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం ఉండేది. మంచి ప్రయత్నాన్ని ప్రేక్షులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోమారు రుజువైంది అని కళ్యాణ్ రామ్ తెలిపాడు. ఈ చిత్రం ద్వారా తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపాడు. మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











