పూరీ జగన్నాథ్ కి ఎన్టీఆర్ కాస్టిలీ గిప్ట్
హైదరాబాద్ : పూరీ జగన్నాథ్ కి ఆ మధ్యన బండ్ల గణేష్ ఓ కాస్టిలీ గిఫ్ట్ ఇచ్చి వార్తల్లో కి ఎక్కారు. ఇప్పుడు మళ్ళీ జూ.ఎన్టీఆర్...ఓ ఖరీదైన గిప్ట్ ని పూరీ కి ఇచ్చి అంతటా హాట్ టాపిక్ గా మారారు. రీసెంట్ గా పూరీ జగన్నాథ్ ...కేవ్ పేరుతో కట్టుకున్న తన సొంత ఆఫీసులోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా...పూరి కి ఎన్టీఆర్ ఆ ఆఫీసుకు ఉపయోగపడేలా... కాస్ట్ లీ కాన్సర్ట్ స్పీకర్స్ ని ఇచ్చారు. ఈ విషయాన్ని పూరి తన ట్విట్ ద్వారా తెలియచేసి,సంతోషాన్ని వ్యక్తం చేసారు.
పూరి ఆ ట్వీట్ లో... "తారక్ నా కొత్త ఆఫీసులో వాడుకునేందుకు ఓ కాస్టలీ కాన్సర్ట్ స్పీకర్స్ ని నాకు గిప్ట్ గా ఇచ్చారు. అవి చాలా అద్బుతంగా ఉన్నాయి...ధాంక్యూ తారక్."అన్నారు. పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఆ చిత్రానికి టైటిల్ గా... టెంపర్ అనుకుంటున్నారు. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రం నిర్మించనున్నారు.

బండ్లగణేష్ మాట్లాడుతూ...' మా సంస్థ నిర్మించిన 'బాద్‌షా' చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయి, ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ చిత్రనిర్మాణసమయంలోనే మరో సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు. పూరి జగన్నాథ్‌గారు నాకు సొంత సోదరుడు లాంటివాడని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తియ్యాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరబోతోంది. అతి త్వరలో ప్రారంభమయ్యే ఈ చిత్రానికి వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాను' అన్నారు. ఈ సినిమాకి కథ: వక్కంతం వంశీ, సమర్పణ: శివబాబు బండ్ల, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











