తిరుమల శ్రీవారిని దర్సించుకున్న జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి
సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కొత్త దంపతులు వేద పండితుల ఆశీస్సులు పొందారు. వారు శుక్రవారమే తిరుమలకు చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని కూడా వారి వెంట ఉన్నారు. శుక్రవారం తెల్లవారు జామున జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి మెడలో మూడు ముళ్లు వేశారు.
సంప్రదాయబద్దంగా వివాహం చేసుకోవడం తనకు ఆనందంగా ఉందని జూనియర్ ఎన్టీర్ శుక్రవారం అన్నారు. తనకు మొదటి నుండి సాంప్రదాయంగా ఉండటం ఇష్టమని, తాను పెళ్లి ఎలాగైతే చేసుకోవాలని అనుకున్నానో అలాగే చేసుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











