శ్రీదేవి అంటే ఎన్టీఆర్ కు ఎందుకంత పిచ్చి?
జూనియర్ ఎన్టీఆర్ కు నచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా? యంగ తరంగ్ లలో ఎవరూ కాదు. ఒకనాటి అందాల నటి శ్రీదేవి. తాత గారితో ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు చూసో ఏమో జూనియర్ మనసు ఆమెపై "ఫిక్స్" అయిపోయింది. శ్రీదేవి ఒప్పుకుంటే వయసులో ఎంత తేడా ఉన్నా నటించడానికి తాను సిద్ధమని జూనియర్ ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక కార్యక్రమంలో చెప్పారు.
శ్రీదేవి అంటే తనకు పిచ్చి అని, ఆ తర్వాత రమ్యకృష్ణ అంతే ఇష్టమని ఆయన చెప్పారు. రమ్యకృష్ణతో నటించేశాను కాబట్టి శ్రీదేవితో నటించాలని ఉందని ఆయన అన్నారు. ముంబైలో స్ధిరపడిపోయిన శ్రీదేవి తనతో నటించడానికి ఒప్పుకోరని ఒకింత నిరాశ వ్యక్తం చేశారు. అయినా ప్రయత్నిస్తానని, ఒక సాంగ్ కైనా ఆమెను ఒప్పించదలచుకున్నానని ఎన్టీఆర్ పట్టుదలగా చెప్పారు. పెద్ద ఎన్టీఆర్ సినిమాల్లో శ్రీదేవి ఆరబోసిన అందాలు ఇప్పటికీ కుర్రకారును వెర్రెక్కిస్తుంటాయి.


Click it and Unblock the Notifications











