జూ ఎన్టీఆర్ ‘దమ్ము’ ఫస్ట్ కాపీ 16నే..
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'దమ్ము' చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలసిందే. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ వర్కు జరుగుతోంది. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం ఫస్ట్ కాపీ ఈ నెల 16 వరకు సిద్దం అవుతుందని తెలుస్తోంది. అనంతరం జూ ఎన్టీఆర్, దర్శక నిర్మాతలు దాన్ని పూర్తిగా పరిశీలించిన అనంతరం ఈ నెల 20న సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కోసం పంపనున్నారు.
'దమ్ము' ఆడియో సూపర్ హిట్ కావడం, ట్రైలర్లో జూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు, యాక్షన్ పవర్ ఫుల్‌గా కేక పుట్టించే విధంగా ఉండటంతో సినిమాపై ఇప్పటికే అంచనాలు అమాంతం పెరిగి పోయాయి. జూనియర్ కెరీర్లోనే ఈ సినిమా మోస్ట్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా నిలుస్తుందని సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.
ఈ చిత్రం గురించి నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ''ఎన్టీఆర్ అభిమానుల అంచనాలను మించిపోయేలా ఈ చిత్రం ఉంటుంది. కథపై పట్టున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన ఈ చిత్రాన్ని మలిచిన విధానం చాలా బాగుంది. ఒక గొప్ప చిత్రాన్ని తీశామన్న ఆనందం కలిగింది'' అని చెప్పారు.
ఈ చిత్రం తర్వాత జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రంలో నటించనున్నాడు. ఈచిత్రంలో జూనియర్‌ను విభిన్నంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూనియర్ ఇందులో కామెడీ పండించడంతో పాటు అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్ ప్రేక్షకులకు పంచనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్కు జరుగుతోంది.


Click it and Unblock the Notifications











