జూ ఎన్టీఆర్ దమ్ము షూటింగ్ లో ప్రమాదం..ఆగిన షూటింగ్...?
బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దమ్ము షూటింగ్ దురదృష్టవశాత్తు ఆగిందని తెలుస్తుంది. దీనిపై అస్పష్టమైన సమాచారం ఉంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ముగిసిన తరువాత, కేరళలోని పోలాచ్చి లో జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమా షూటింగ్ జరుగుతుంది.
ఈ సినిమా షూటింగ్ లో కెమరాను సెట్ చేయడం కోసం నదిలో నడుచుకుంటూ వెళ్ళిన ఓ హెల్పర్ బాయ్ ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయాడని సమాచారం. అతని ఆచూకీ కోసం శుక్రవారం ఉదయం నుంచి యూనిట్ మొత్తం గాలిస్తుంది. షూటింగ్ ను నిలిపివేశారు. హెల్పర్ బాయ్ ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. దురదృష్టవశాత్తు జరిగిన ఈ సంఘటన వలన మరి కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయే సూచనలు ఉన్నాయి. ఈ విషయమై యూనిట్ వర్గాల నుంచి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.
jr ntr trisha karthika boyapati srinu mm keeravani జూ ఎన్టీఆర్ త్రిష కార్తిక బోయపాటి శ్రీను ఎంఎం కీరవాణి


Click it and Unblock the Notifications