అది చూసుకొనే ఎన్టీఆర్ కి అంత ధైర్యం
అతని వెనుక మంది బలం లేదు. రాజకీయ బలం అంతకన్నా లేదు. కానీ కావల్సినంత దమ్ముంది. అది చూసుకొనే అంత ధైర్యం అంటూ ఎన్టీఆర్ తాజా చిత్రం 'దమ్ము'లో పాత్ర గురించి బోయపాటి శ్రీను చెప్తున్నారు. అలాగే పోరాటం అంటే అతనికి ఇష్టం. చుట్టూ వందమంది ఉన్నా తొణకడు, బెణకడు. కత్తులూ, బుల్లెట్లూ కూడా అతన్ని ఆపలేవు. ఇంతకీ అతను ఎవరిపై పోరాటం చేశాడు? తన దమ్ము ఎలా చూపించాడు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'దమ్ము' సినిమా చూడాల్సిందే అంటున్నారు. త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం ఇటీవల పొలాచ్చిలో ఓ పాట, కొన్ని యాక్షన్ ఘట్టాలతో పాటు కీలకమైన సన్నివేశాలు తెరకెక్కింది. ఈనెల 27 నుంచి హైదరాబాద్‌లో తదుపరి షెడ్యుల్ షూటింగ్ మొదలుపెడతారు. ఈ విషయమై నిర్మాత అలెగ్జాండర్ వల్లభ మాట్లాడుతూ... ''దమ్ముతో దుమ్మురేపే కుర్రాడి కథ ఇది. యాక్షన్, వినోదం మేళవించాం. రెండు పాటలు, కాస్త టాకీ మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తామని''అన్నారు. ఇక దమ్ము చిత్రం ఆడియో ఉగాది రోజున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియోని ఫ్యాన్సీ రేటు ఇచ్చి వేల్ రికార్డులు వారు తీసుకున్నారు. ఈ ఆడియో పంక్షన్ ని విభిన్నంగా చేయాలని నిర్మాత అలగ్జాండర్ వల్లభ ప్లాన్ చేస్తున్నారు. మల్టి సిటీ ఆడియో ఫంక్షన్ గా దీన్ని తీర్చి దిద్దుతున్నారు. అంటే మూడు సిటీల్లో ఒకే సారి అభిమానుల మధ్య ఈ ఆడియో పంక్షన్ గ్రాండ్ గా జరుగుతుంది. సంగీతం: ఎం.ఎం.కీరవాణి.


Click it and Unblock the Notifications











