మళ్ళీ పవన్ కళ్యాణ్ వర్సెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్...!?
పోటీలు పడి మరీ ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్ ఇద్దరూ తమ ప్రమేయం లేకుండానే బాక్సాఫీస్ వద్ద అదే పనిగా తలపడుతున్నారు. గత దసరా సీజన్ లో కొమరం పులి, బృందావనం చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో బృందావనం హిట్ కాగా, పులి ప్లాపయింది.
ఆ తర్వాత మళ్లీ గత వేసవిలో వీరిద్దరి మధ్య పోటీ జరిగింది. రెండు వారాల వ్యవధిలో శక్తి, తీన్ మార్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండూ కూడా దారుణంగా పరాజయం పాలయ్యాయి. ఇదిలావుంటే తాజాగా మరోసారి వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద అమీతుమీ తేల్చుకోబోతున్నారు.
వచ్చే వేసవికి ఎన్టీఆర్ నటించిన దమ్ము, వపన్ సినిమా 'గబ్బర్ సింగ్" విడుదల కానున్నాయి. ఇంతవరకు జరిగిన పోటీలో ఎన్టీఆర్ కే ఆధిపత్యం ఉంది. ఈసారి మరి పవన్ లెక్క సరి చేసుకుంటాడో లేదా ఎన్టీఆర్ కి 2-0లీడ్ తో సీరీస్ అప్పగిస్తాడో చూడాలి...


Click it and Unblock the Notifications











