'దమ్ము' ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్
ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము ప్రీమియర్ షో యుఎస్,కువైట్ వంటి చాలా చోట్ల వేసారు. ఈ చిత్రం అక్కడ మంచి టాక్ తెచ్చుకుంది. అభిమానులు అందించిన ఈ చిత్రం లైవ్ అప్ డేట్స్ ఒకసారి చూస్తే...
* బ్లాక్ అండ్ వైట్ లో.. ఒకానొకప్పుటి రెండు కుటుంబాలను పరిచయం
* నాజర్, సుమన్ ఫైట్ తో టైటిల్స్ మొదలవుతాయి.
* ఇరవై ఐదు సంవత్సరాలు తర్వాత .. జూ.ఎన్టీఆర్... రాజా వాసిరెడ్డి గా ఎక్స్టార్డనరీ ఫైట్ తో ఎంట్రీ ఇస్తాడు
* అశ్విని గా త్రిష పరిచయం. ఎన్టీఆర్ ..త్రిషను ట్రై చేస్తాడు. ఓ పిల్ల పాట పిక్చరైజేషన్ ఎన్టీఆర్,త్రిషల మీద ఉంటుంది.
* పోలీస్ తో చిన్న ఫైట్
* చూడటానికి గాలి వాడిల ఉంటా గానీ మంచోడ్ని... ఎన్టీఆర్ డైలాగు
త్రిష: నీ బ్యాక్ గ్రౌండ్ చెప్పు..
ఎన్టీఆర్: నా బాంక్ లో 68 లక్షలు ఉన్నాయి
త్రిష: నాకు 6 వేల కోట్లు ఉంది
ఎన్టీఆర్: అంటే నా ఆస్ధి 68 లక్షల ఆరు వేల కోట్లు
* కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందంలతో కలిసి విలేజ్ లోకి ఎంట్రీ ఇస్తాడు
* వేణు క్యారెక్టర్ పరిచయం..ప్యామిలీ సెంటిమెంట్, అబినయ చెల్లెలుగా ఎంట్రీ
* ఆ వంశంలో వాళ్లకి రక్తం లో పోటెక్కువ ప్రతీ చుక్క పోటెత్తుంది. ఎన్టీఆర్ డైలాగు
* మగధీరలోలాగ ఎన్టీఆర్ కి ఏదో ప్లాష్ బ్యాక్ గుర్తుస్తోంది..
* రూలర్ సాంగ్ లో ఎన్టీఆర్ గెటప్ సూపర్..
* కార్తీక ఎంట్రీ అదుర్స్
* కార్తీక మాటి మాటికి నన్ను ఉపయోగించుకోండి అంటుంది...త్రిష వేసేస్తాను అంటుంది.
* సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా వెళ్తోంది.
* బోయపాటి టేకింగ్ బాగుంది..ఎడిటింగ్ కూడా
* త్రిష ఇప్పుడు ఓ ట్విస్ట్ ఇచ్చింది
* ఈ ఊళ్లో చంపుకోవటానికి కూడా తాంబూలూలాలు తీసుకుంటారు... కాన్సెప్ట్ బాగుంది కదా
* డైలాగు సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసేది ఎగిరి కొరకడానికే.. సూపర్ డైలాగు
* రూలర్ పాట మొదలైంది. ఎక్లలెంట్ టేకింగ్ ఈ పాటలో ఉంటుంది.
* నీలవేణి గా కార్తీక ఎంట్రీ. అలీ కామెడీ..అలీ, కార్తీక, ఎన్టీఆర్ మధ్యలో సన్నివేశాలు
* మూడవ పాట దమ్ము దమ్ము ..మంచి కొరియోగ్రఫీతో సాగుతుంది.
* సినిమా కథలో మొదటి మలుపు తీసుకుంది. విలన్ నాజర్ ఇంటికి ఎన్టీఆర్ వెళతాడు.
* ఎన్టీఆర్ మంచి టైమింగ్ డైలాగు... ఇంత వరకూ ఈ చెయ్యి అవసరం కోసం వాడాను... ఆశయం కోసం వాడితే ఎలా ఉంటుందో తెలుసా...
* ఫస్టాఫ్ మొత్తం మూడు పాటలుతో, మంచి కామెడీ, సెంటిమెంట్ తో వెళ్లిపోయింది.
సెంటిమెంట్ తో కూడిన ఫైట్ తో ఇంటర్వెల్ ..
* రాజా వాసిరెడ్డి పాటతో సెకండాఫ్ బిగిన్ అయ్యింది.
* ఇంటర్వెల్ అయ్యాక వచ్చే కీరవాణి ఆర్.ఆర్ అద్బుతంగా ఉంది.
* కామెడీ యాక్షన్ పారలెల్ గా నడుస్తోంది
* స్టోరీ జరుగుతోంది
* ఎన్టీఆర్, కలెక్టర్, విలన్ మధ్య సీన్స్ వస్తున్నాయి. డైలాగులు అదిరిపోతున్నాయి
* కొన్ని మెయిన్ సీన్స్ అయ్యాక...ఐదవ పాట వచ్చింది..వాస్తు బాగుందే...నలుగురు బ్యూటీస్ తో ఎన్టీఆర్ అదరకొట్టాడు.
* విలన్స్ ఎటాక్ చేస్తున్నారు...ఎన్టీఆర్ గొడవలు లేకుండా చెయ్యాలి అని ట్రై చేస్తున్నాడు
* వేణు ట్రబుల్ లో పడిపోయాడు
* బురద ఫైట్ మొదలైంది..సూపర్ గా ఉంది.
* ఎక్కడ ఎక్కడ ఎక్కడ రేయ్..కుమ్ము...
* బ్రతకండి బ్రతకండి అంటే వినలేదు కదరా...డైలాగు వస్తోంది
* ట్విస్ట్...ఎన్టీఆర్ ఎవరి కొడుకో రివిల్ అవుతుంది
* క్లైమాక్స్ ఫైట్ చాలా లెంగ్తీగా ఉంది
* సింబల్ కాదు రా సిస్టమ్ బ్రేక్ అవ్వాలి..డైలాగు
* దమ్ము పట్టుకున్న కత్తి లో ఉండదు రా రక్తంలో ఉండాలి...
* క్లైమాక్స్ సూపర్ టేకింగ్
* హెవీ యాక్షన్ సీన్స్ ...ప్రీ క్లైమాక్స్ లో వస్తాయి. సింహాద్రిలో కేరళ ఫైట్ ని తలపిస్తాయి.
* కుటుంబాని,ఎన్టీఆర్ కి మధ్య వచ్చే సీన్స్ లో కుటుంబ బంధాల విలువ ఏంటో తెలుస్తుంది.
* దమ్ము క్లైమాక్స్ ఫైట్..డైలాగులతో కలిపి ఢిపెరెంట్ గా ఉంది.
* దమ్ము చిత్రం మాస్ ఆడియన్స్ కి,ఫ్యాన్స్ కి బాగా కిక్కు ఇస్తుంది.
భానుప్రియ, నాజర్, సుమన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, అలీ తదితరులు ఇతర పాత్రధారులు. రచన: ఎమ్.రత్నం, పాటలు: చంద్రబోస్, కెమెరా: ఆర్థర్ విల్సన్. ఈ చిత్రానికి కె.ఎ.వల్లభ నిర్మాత. కె.ఎస్.రామారావు సమర్పకులు.


Click it and Unblock the Notifications











