జూ ఎన్టీఆర్ ‘దమ్ము’ విడుదల ఖరారు
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. ఎందకంటే ఈ నందమూరి చిన్నోడు నటిస్తున్న 'దమ్ము' చిత్రం ఇంకా ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల చేద్దామని ముందుగా అనుకున్నారు. అయితే షూటింగ్ శర వేగంగా పూర్తవుతుండటంతో మార్చిలోనే 'దమ్ము' ప్రేక్షకులకు చూపిస్తారట. ఫిబ్రవరి 18 నాటికి సినిమా టాకీపార్టు షూటింగ్ పూర్తి చేసి, మార్చి 28న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరుగాంచిన బోయపాటి శ్రీను 'దమ్ము'చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ సరసన త్రిష, కార్తీక రొమాన్స్ చేస్తున్నారు. తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు. భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది. జూనియర్ ఇందులో పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడనే ప్రచారం సాగుతున్నప్పటికీ అధికారికంగా కన్ ఫర్మ్ కాలేదు.
ఈ సక్రాంతికి దమ్ము చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల కానుంది. దాన్ని బట్టి సినిమా ఎలా ఉండబోతోందనే విషయం తేలి పోనుంది. దమ్ము చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై అలెగ్జాండర్ నిర్మిస్తున్నారు. కీరవాణ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











