జూ ఎన్టీఆర్ ‘దమ్ము’ తాజా విశేషాలు
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దమ్ము' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్ర న్యూ షెడ్యూల్ తమిళనాడు కోయంబత్తూర్ సమీపంలోని పొల్లాచ్చి ప్రాంతంలో జరుగుతోంది. దర్శకుడు బోయపాటి శ్రీను ఇక్కడ ఫైట్ సీన్లు చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. దమ్ము చిత్రం షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తియింది. ఫిబ్రవరి కల్లా షూటింగ్ కంప్లీట్ చేసుకుని మార్చిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
జూనియర్ సరసన త్రిష కార్తీక నటిస్తున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని...ఒక పాత్రలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా, మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు అని తెలుస్తోంది. అయితే ఇందులో ఫ్యాక్షనిస్టు పాత్రలో ఫాదర్ గా, పోలీస్ ఆఫీసర్ పాత్రలో కుమారుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడని సమాచారం. హీరోయిన్ కార్తీక ఇందులోని ఎన్టీఆర్ ఫాదర్ పాత్రకు జోడీగా నటిస్తుండగా...పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉండే ఎన్టీఆర్‌తో త్రిష రొమాన్స్ చేయనుందని అంటున్నారు.
యాక్షన్ అండ్ మాస్ మసాలా ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్నారు. క్రేజీ హీరో ఎన్టీఆర్ కావడంతో దర్శకుడు బోయపాటి అతని క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ విషయంలో ప్రత్యేక శద్ద తీసుకుంటున్నారు. ఇప్పటికే బయటకు లీకైన దమ్ము డైలాగులకు అభిమానులను మంచి రెస్పాన్స్ వస్తోంది కూడా.


Click it and Unblock the Notifications











