జూ ఎన్టీఆర్ ‘దమ్ము’ ప్యాకప్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'దమ్ము' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. త్రిష, కార్తీక ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయి ప్యాకప్ అయింది.
ఈచిత్రానికి సంబంధించిన చివరి పాట 'వాస్తు బాగుందే' నలుగురు భామలతో చిత్రీకరించారు. ఈ సాంగులో త్రిష, కార్తీక తో పాటు రచనమౌర్య, మరియం జకారి తమ అందాలను ఆరబోశారు. ఇప్పటికే విడుదలైన దమ్ము ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్లో ఎన్టీఆర్ డైలాగులు పవర్ ఫుల్ గా అదరగొడుతుండటంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
కోట శ్రీనివాసరావు, భాను ప్రియ, శుభలేఖ సుధాకర్, వేణు తొట్టెంపూడి, అభినయ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలెగ్జాండర్ వల్లభ క్రియేటివ్ కమర్షియల్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈచిత్రం తర్వాత జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్కు జరుగుతోంది. దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్కు పూర్తి చేశారు. దూకుడు సినిమాకు పని చేసిన సాంకేతిక బృందం మొత్తం 'బాద్ షా' చిత్రానికి పని చేయనున్నారు.


Click it and Unblock the Notifications











