జూ ఎన్టీఆర్ డాన్స్ అంటే మహా ఇష్టం: నిషా అగర్వాల్
పాపులర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ అని మనకు తెలిసిందే. నిషా నటించిన మొదటి చిత్రం ' ఏమైంది ఈ వేల ' విజయం సాధించింది. ఆమె హీరోయిన్ గా నటించిన రెండవ చిత్రం 'సోలో" ఈ నెల 25న విడుదలకు సిద్ధమైంది. నారా రోహిత్ పక్కన ఆమె నటించిన ఈ చిత్రంలో మంచి పాత్ర చేశానని, సినిమా గ్యారెంటీగా హిట్ కొడుతుందని నిషా చెబుతోంది. జూ ఎన్టీఆర్ డాన్స్ కి తను పెద్ద ఫ్యాన్ ని అని తాను కూడా మంచి డాన్సర్ ని అని నిషా అగర్వాల్ అన్నారు. త్వరలో తన డాన్స్ టాలెంట్ ని చూపించబోతున్నానని తెలిపారు.
మొదట్లో యాక్టింగ్ చేయడం చాలా నెర్వస్ గా ఫీల్ అయ్యేదానిని అని ప్రకాష్ గారితో పని చేయడం మొదలు పెట్టాకా యాక్టింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాని, ప్రకాష్ గారు నటనలో మెళకువలు నేర్పారని, ఆయనకు సినిమా గురించి అధ్బుతమైన పరిజ్ఞానం ఉంది అని అన్నారు. తన అక్క నిషా మరియు అనుష్క తన ఫేవరేట్ హీరోయిన్స్ అని చెప్పారు. ప్రస్తుతం తను 'ఏమైంది ఈ వేల ' తమిళ్ రీమేక్ చిత్రంలో నటిస్తుంది ఈ చిత్రంతో పాటు మరికొన్ని తెలుగు చిత్రాలలో కూడా నటించనుంది.


Click it and Unblock the Notifications











