Devara trailer date Out: వినాయక చవితి వేళ ఫ్యాన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ క్రేజీ గిఫ్ట్..
Devara trailer date revealed: సౌత్ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'దేవర. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ మూవీ విడుదలకు మరికొన్ని రోజులే మిగిలి ఉంది. ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ నందమూరి అభిమానులకు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు కాస్త ట్రోల్స్‌కు గురైనా.. తర్వాత వింటోన్న కొద్ది వినాలపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని, ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ మూవీ మీద అంచనాలు పెంచుతున్నారు. ఇన్ డైరెక్టర్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు మూవీ మేకర్స్.

దేవరకు సంబంధించి ఓవర్సీస్ వన్ వీక్ కిందటే బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా విడుదలకు ఇంకా మూడు వారాల సమయం ఉండగానే ఏకంగా 600 కే డాలర్టు బుకింగ్స్ క్రాస్ చేసిందంటేనే ఈ మూవీ కోసం ఎంతగా వేయిట్ చేస్తున్నారో అర్థమవుతుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న దేవర కోసం తారక్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది బిగ్ ప్రాజెక్టు అని చెప్పుకోవచ్చు. కేవలం తెలుగులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కావనున్నది. అయితే సినిమా ప్రమోషన్స్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఓపెనింగ్స్ సాలిడ్‌గా వస్తాయా? అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రమోషన్స్ చేసినా చేయకున్నా ఎన్టీఆర్ కు ఇక్కడ మంచి క్రేజ్ ఉంది.కాబట్టి.. ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో రావడం పక్కా అంటున్నారు తారక్ ఫ్యాన్స్. అయినా.. భారీ ఓపెనింగ్స్ రావాలంటే మాత్రం టీమ్ ప్రమోషన్స్ ప్రారంభించడం బెటర్ అంటున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ తరుణంలో తాజాగా ఎన్టీఆర్ దేవర మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర కు సంబంధించిన ట్రైలర్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌ను సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నట్లు దేవర టీం ప్రకటించింది. అయితే ఈ ట్రైలర్ ఈవెంట్‌ను ముంబైలో భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో వరుసగా ప్రమోషన్స్ చేస్తుంది చిత్రయూనిట్. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్‌తో పాటు సెకండ్ సింగిల్ చుట్టమల్లే.. థర్డ్ సింగిల్ దావుడి పాటలను విడుదల చేశారు. ఈ మూడు పాటలు యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. ఇక మూవీ కలెక్షన్స్ కూడా బాక్సాఫీసు వద్ద మోత మోగనున్నాయని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











