జూ ఎన్టీఆర్ పై పేలుతున్న జోకులు...?!
కరెంటు తీగ కూడా నాలాగే సన్నాగా ఉంటది..కానీ ముట్టుకుంటే దానమ్మా షాక్ కొట్టేస్తది...!" అనే డైలాగ్ ని సినిమాలో చెప్పడమే కాకుండా, దానిని ఫస్ట్ ట్రెయిలర్ లో రిలీజ్ చేసి, ఆ తర్వాత దానినే ఆడియో వేడుకలోనూ చెప్పిన జూ ఎన్టీఆర్ ని చూస్తే..ఆ డైలాగ్ అంటే అతనెంత ముచ్చటపడిపోతున్నాడో అర్థమవుతోంది. తనని కరెంటు తీగలా సన్నాగా ఉన్నావని అనేసరికి జూ ఎన్టీఆర్ ఉబ్బితబ్బిబైపోయాడేమో..ఏదో సన్నజాజి తీగలా ఉన్నావని అంటే అమ్మాయి మురిసిపోయినట్టు ఎన్టీఆర్ మురిసిపోతున్నాడు జూ ఎన్టీఆర్.
అయితే ఎన్టీఆర్ వాలకం చూసి...ఆ డైలాగ్ విని...'ఏ కరెంట్ తీగ బాబూ..ఇంత 'సన్నగా" ఉండేది అంటూ జనం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ డైలాగొకటి చాలదన్నట్టు రాజమౌళి మళ్లీ మళ్లీ బతిమాలుకుంటూ ఎన్టీఆర్ తన స్థాయిని దిగజార్చుకుని బతిమాలడం బాగోలేదని, జూ ఎన్టీఆర్ తో చేసే కథ సిద్దమైతే అతనే వస్తాడు కదా అని ఎన్టీఆర్ హితులు చెబుతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో తమన్నా, జూ ఎన్టీఆర్ మద్య క్లైమాక్స్ సీన్స్ కొన్ని ను చిత్రీకరిస్తున్నారు. ఊసరవెల్లి" షూటింగ్ దాదాపు పూర్తి అయ్యీ, అక్టోబర్ 6 న విడుదల అయ్యేందుకు త్వర త్వరగా సన్నాహాలు సిద్ద చేసుకోంటోంది.


Click it and Unblock the Notifications











