జూ ఎన్టీఆర్ యంగ్ టైగర్ నుండి ఏ వన్ స్టార్ కి ఎదిగిపోయాడా...!
'శక్తి" ఆడియో విడుదల వేడుక ఎలా జరిగినా, ఆ వేడుకలో జూ ఎన్టీఆర్ దర్శకుడు మొహర్ రమేష్, నిర్మాత అశ్వనీదత్ ఇచ్చిన బిరుదులు మాత్రం నందమూరి అభిమానులకు నచ్చలేదు. అభిమానులకేంటి?జూ ఎన్టీఆర్ కే నచ్చలేదంట. 'ఏ-1 స్టార్"అన్న ప్రతిపాదన మొహర్ రమేష్ నుంచి వస్తే, మొదటే దాన్ని జూనియర్ ఎన్టీఆర్ తిరస్కరించాడట. చూద్దాం..క్లిక్కవుతుందేమోనని మొహర్ రమేష్ సర్థిచెప్పేసరికి జూ ఎన్టీఆర్ సరే అన్నా, ఆడియో రిలీజయ్యాక 'ఏ-1 స్టార్" అన్న పిలుపు వెటకారంగా వుందనే కామెంట్లు రావడంతో తక్షణం మార్చేయాలని జూ ఎన్టీఆర్ హుకూం జారీ చేశాడట. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ గానే 'శక్తి" సినిమా టైటిల్స్ లో జూ ఎన్టీఆర్ పేరు పడనుందని సమాచారం. మరోపక్క, ఇంకో గొప్ప టైటిల్ వెతికి, దాన్ని జూ ఎన్టీఆర్ కి విన్సించే ప్రయత్నంలో బిజీగా వున్నాడిప్పుడు దర్శకుడు మొహర్ రమేష్, సినిమా టైటిల్ వెతుక్కోడానికే నానా తంటాలు పడ్తోంటే, ఇప్పుడు స్టార్ల పేర్లకు ముందు టైటిల్ గోలేంటో మరి..


Click it and Unblock the Notifications











