గజనీ సూర్యను డామినేట్ చేసిన జూ ఎన్టీఆర్...
జండూబామ్ యాడ్ ఫిల్మింలో నటించేందుకు తమిళ హీరో సూర్య, మన యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఇద్దరూ ముంబాయ్ కి వెళ్లారు. తమిళ వెర్షన్ లో సూర్యతో, తెలుగు వెర్షన్ లో జూ ఎన్టీఆర్ తో నటించిన మలైకా అరోరా ఖాన్, షూటింగ్ పూర్తయ్యాక తమిళ హీరో సూర్య మహా సిగ్గరి అని ప్రకటించింది. మలైకా అరోరా ఇచ్చిన స్టేట్ మెంట్ ను ఈ యాడ్ ఫిల్మింకు దర్శకత్వం వహిస్తున్న ప్రహ్లాద్ కక్కర్ కూడా సమర్థించాడు.
ఇంటిమేట్ సీన్స్ లో నటించేటప్పుడు సూర్య సిగ్గుపడడం తమకు చాలా ఆశ్చర్యం కలిగించిందని వారివురూ ఏకరువు పెట్టారు. అయితే ఎన్టీఆర్ మాత్రం చాలా ప్రొఫెషనల్ గా, ఎంత మాత్రం సిగ్గు పడకుండా యాక్ట్ చేసాడని, అతనితో కలిసి పనిచేయడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని వారిద్దరూ చెప్పుకొచ్చారు. అయితే స్వతహా పోటీ స్వభావం కలిగిన ఎన్టీఆర్, తమిళ వెర్షన్ లో సూర్య చేసినదానికంటే తనే బాగా చేసాడనే పేరు తెచ్చుకునేందుకు, తనదైన శైలిలో ఇరగదీసాడని తెలుస్తోంది. తన తాత ఎన్టీఆర్ ను సైతం మరపించేలా నటించే ఎన్టీఆర్ కు సూర్యను డామినేట్ చేయడం పెద్ద లెక్కేమీ కాదు కదా....


Click it and Unblock the Notifications