జూ ఎన్టీఆర్‘బాద్ షా’లో కూడా అదే ఫార్ములా...!
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ రెండు పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఇటీవల కాలంలో రెండు పాత్రల్లో నటించిన అదుర్స్, దమ్ము లాంటి చిత్రాలు భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈచిత్రంలో కూడా అదే ఫార్ములా వాడటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
బాద్ షా చిత్రం తొలి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ యూరఫ్‌లో ప్లాన్ చేశారు. ఈ మేరకు యూనిట్ సభ్యులంతా అక్కడి వెళ్లనున్నారు. రెండు నెలల పాటు అక్కడ షూటింగ్ జరుగనుంది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న 'బాద్‌షా' సినిమాకు శ్రీనువైట్ల దర్శకుడు. కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.
మార్చి నెలలోనే ఈచిత్రం షూటింగ్ లాంచనంగా ప్రారంభం అయింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్‌పై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా వెంకటేష్ కెమెరా స్విఛాన్ చేశారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ... 'దూకుడు' లాంటి సూపర్‌హిట్ తర్వాత చేస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్ ఇమేజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఎన్టీఆర్ చిత్రమంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ఆ అంశాలన్నీ ఇందులో వుంటాయి. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. యాక్షన్‌తో పాటు ఇందులో ఓ అందమైన ప్రేమకథ ఉంటుందని అన్నారు.


Click it and Unblock the Notifications











