నాన్నగారి హోదాలో వచ్చిన బాబాయ్... : ‘అరవింద సమేత’ సభలో ఎన్టీఆర్ స్పీచ్ అదుర్స్
ఎన్టీఆర్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కినప అరవింద సమేత వీరరాఘవ బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకోవడంతో హైదరాబాద్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబాయ్ బాలయ్య గురంచి ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాన్నగారు లేక లేక పోయినా తండ్రి హోదాలో హోదాలో ఇక్కడికి వచ్చిన బాబాయ్ అంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

కొత్త ప్రయత్నాన్ని ఆశీర్వదించారు
``మా సినిమా అనే ప్రయత్నాన్ని ఆశీర్వదించిన అభిమాన సోదరులకు వందనాలు. ఎంతో శ్రద్ధతో, ఎంతో నమ్మకంతో ఎంతో జాగ్రత్తతో కొత్త ప్రయత్నానికి నాంది పలికిన నా ఆప్తుడు, మిత్రుడు, శ్రేయోభిలాషి, నా కుటుంబ సభ్యుడు త్రివిక్రమ్ మీ నమ్మకాన్ని మరోసారి భహిర్గతం చేశారు. ఆయనకు రెట్టింపు ఉత్సాహం కలిగించిన ప్రేక్షక దేవుళ్లకు పాదాభివందనం చేస్తున్నాను.

నల్లమబ్బు కమ్మిన మా కుటుంబంలోకి కొత్త వెలుగు
ఈ విజయదశమికి నల్లమబ్బు కమ్మిన విషాద చాయల్లో ఉన్న మా కుటుంబంలోకి కొత్త వెలుగు తెచ్చినందుకు త్రివిక్రమ్ స్వామికి థాంక్యూ. జీవితాంతం గుర్తుండిపోయే సినిమాను ఇచ్చారు.... అంటూ ఎన్టీఆర్ అభిమానుల ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

పల్లకీ మోసింది వాళ్లే
మా ఇద్దరి కలను వెనుక కూర్చుని వాళ్ల భుజాలపై తీసుకెళ్లిన ప్రతి సాంకేతిక నిపుణులు, ప్రతి నటుడు, ప్రతి నటి, ఇలా అందరికీ చేతులు జోడించి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నారు. మీరంతా మమ్మల్ని చూస్తున్నారు. కానీ పల్లకీని మోసింది మా వెనక ఉన్న సాంకేతిక నిపుణులే. వాళ్ల కృషి వల్లనే ఈ విజయం సాధ్యమైంది.

నాన్న గారి హోదాలో వచ్చిన బాబాయ్
ఈ రోజు ఈ ఆనందాన్ని కేవలం అభిమానులతోనే కాదు, మా బాబాయ్‌తోనూ పంచుకోవాలి. అన్నయ్య చెప్పినట్లు ఒకే ఒక లోటు... నాన్న ఉండి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. కానీ నాన్న ఎక్కడో ఉండరు... ఇక్కడే ఎక్కడో తిష్ట వేసుకుని చూస్తూ ఉండి ఉంటారు ఈ రోజు జరిగే ఈ ఘట్టాన్ని. నాన్నగారు లేక లేక పోయినా తండ్రి హోదాలో హోదాలో ఇక్కడికి వచ్చిన బాబాయ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకన్నా మేం మాట్లాడితే బాగోదు. అందరూ ఎదురు చూసేది ఆయన మాటలకోసమే`` అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











