రాజమౌళి దర్శకత్వంలో అతి త్వరలోనే జూ ఎన్టీఆర్
రాజమౌళి దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ త్వరలో నటించనున్నారు. అయితే సినిమాకు మాత్రం కాదు. ఓ యాడ్ ఫిలిం షూటింగ్ అది. నవరత్న టాల్కమ్ పౌడర్ యాడ్ ఫిలిమ్ బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసిన ఎన్టీఆర్ దర్శకుడుగా రాజమౌళిని సూచించారు. ఎన్టీఆర్ కు ఇది రెండో యాడ్ ఫిలిం. మొదటిది జండూభామ్. ఇక రాజమౌళికి ఇది మొదటి కమర్షియల్ యాడ్ ఫిలిం. డైరక్టర్ కాకముందు ఆర్కే బ్యానర్ లో ఎలక్ట్రానిక్ మీడియాకు యాడ్స్ చేసారు. గతంలో సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ వంటి సూపర్ హిట్స్ అందించిన ఈ కాంబినేషన్ ఈ యాడ్ ఫిలింతో ఏ రేంజి ప్రొడెక్ట్ ని ఇవ్వనున్నారో అని అంతా ఎదురుచూడటం మాత్రం ఖాయం.


Click it and Unblock the Notifications











