‘శక్తి’తో నా సత్తా ఏంటో మరో మారు చాటి చెప్తా..జూ ఎన్టీఆర్
ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందడం ద్వారా వచ్చే కిక్కుని తాను తొలిసారిగా 'బందావనం" తో ఎంజాయ్ చేస్తున్నానని అంటున్నాడు హీరో జూ ఎన్టీఆర్. పెళ్ళి కుదిరాక ఆ కిక్కు లభించడం చాలా ఆనందంగా వుందంటోన్న జూ ఎన్టీార్, మాస్ ఇమేజ్ ని వున్న పళంగా వదులుకోనుగానీ, అప్పుడప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ ని దష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తానని చెబుతున్నాడు. 'దిల్ రాజు" తనకు సబ్జెక్ట్ చెప్పగానే, ఆయన మీదున్న నమ్మకంతో ఒప్పుకున్నాననీ, దర్శకుడు వంశీ సినిమాని తెరకెక్కించిన తీరు అద్భుతమనీ కితాబులిచ్చేశాడు. జూ ఎన్టీఆర్.
ఇంకోసారి వంశీ డైరెక్షన్ లో, దిల్ రాజు నిర్మాణంలో నటించాలని వుందంటోన్న జూ ఎన్టీార్, తనలాంటి మాస్ హీరోతో క్లాస్ సినిమా చేయాలనే ఆలోచన వచ్చినందుకు దిల్ రాజుకు హ్యాట్సాఫ్ చెబుతున్నాడు. 'శక్తి" సినిమాలో ప్రేక్షకులందరికీ కొత్త ఎన్టీఆర్ కన్సిస్తాడనీ, 'బందావనం" సినిమాకీ, 'శక్తి" కీ ఎక్కడా పోలిక ఉండదనీ, 'శక్తి" సినిమాతో తన సత్తా ఏంటో మరో మారు చాటి చెప్తానని జూ ఎన్టీఆర్ అంటున్నాడు.


Click it and Unblock the Notifications











