జూ ఎన్టీఆర్ కి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..!
టాలీవుడ్ దసరా బరిలో ఊసరవెల్లిని నిలపడానికి బుడ్డ ఎన్టీఆర్ చాలా ప్రయత్నం చేస్తున్నాడట. ఎన్టీఆర్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఊసరవెల్లి రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సిని చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో అశోక్ తరువాత వస్తున్న సినిమా ఇది. రవితేజతో కిక్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన తరువాత సురేందర్ రెడ్డి చేస్తున్న సినిమా ఇది. మిల్కీ బ్యూటీ తమన్నా, ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తుంది.
గత దసరాకి బృందావనం అనే ఫ్యామిలీ సినిమా చేసి సెలవుల్ని అనుకూలంగా మార్చుకున్న జూ ఎన్టీఆర్ ప్రతి దసరాకి అలాంటి ఎంటర్ టైనర్ ఒకటి రెడీ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. దసరా సీజల్ లో సరయిన సినిమా పడితే మాస్ హీరోలకి ఎక్స్ ట్రా బెనిఫిట్ ఉంటుందని జూ ఎన్టీఆర్ వేసిన ఎత్తు చిత్తయింది. దసరాకి రావాల్సిన ఊసరవెల్లి సినిమా అనుకున్న సమయానికి పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. దాంతో ఈ సినిమాని డిసెంబర్ కి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు బోయపాటి శ్రీను సినిమాని కూడా ప్యారలల్ గా పూర్తి చేయాలని చూసిన జూ ఎన్టీఆర్ కొన్నాళ్లకి ఆ సినిమా పనులు పక్కన పెట్టి పూర్తిగా ఊసరవెల్లి మీదే దృష్టి పెట్టాడు. అయినా కానీ సకాలంలో ఈ చిత్రాన్ని పూర్తి చేయలేకపోయాడు...ఈ సినిమా దసరాకి విడుదల చేయాలని జూ ఎన్టీఆర్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడని అది సెంటిమెంట్ గా భావిస్తున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











