twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళిని ఎటాక్ చేసిన జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్...!?

    By Sindhu
    |

    యువరత్న జూ ఎన్టీ‌ఆర్ నటించిన క్రొత్త చిత్రం ఊసరవెల్లి ఆడియో విడుదల భారీ ఎత్తున జరిగింది. వందలాది మండి అభిమానులు, సినీ కళాకారులు, ఆర్టిస్టుల మధ్య శిల్ప కళా వేదిక, మాధాపూర్ లో జరిగిన విషయం విధితమే. ఈ కార్యక్రమానికి కె రాఘవేంద్ర రావు, ఎస్‌ఎస్ రాజమౌళి, బోయపాటి శ్రీను, సురేష్ బాబు, కే‌ఎస్ రామారావు, హరీష్ శంకర్, ఎం‌ఎం కీరవాణి, రమ రాజమౌళి, దేవి శ్రీ ప్రసాద్, బండ్ల గణేశ్, వల్లభనేని వంశీ లతో పాటు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. వేదికపై జూ ఎన్టీ‌ఆర్, తమన్నా, సురేందర్ రెడ్డి, దేవి శ్రీ ప్రసాద్ ల డ్యాన్స్ ప్రధాన ఆకర్షణ గా నిలిచింది.

    ఈ కార్యక్రమంలో బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, దేవీశ్రీ ప్రసాద్, దిల్ రాజు, తమన్నా, జూ ఎన్టీఆర్, రాజమౌళి లు మాట్లాడి సినిమా గురించి తమ అభిప్రాయంను, అభిరుచులను తెలియజే శారు. ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి కి ప్రేక్షకుల నాడి బాగా తెలుసు. అందుకే ఓటమి ఎరుగని దర్శకుడి గా చిత్ర పరిశ్రమ లో నిలిచాడు. అతడు ఒక మాట అన్నాడు అంటే దానిని సినీ విశ్లేషకులు చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇంతకు ముందు కూడా దమ్ము సినిమా గురించి చాలా గ్రేట్ గా మొచ్చుకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే ఫీలింగ్ లో ఎన్టీఆర్ నటించిన 'ఊసరవెల్లి" ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రాజమౌళి ఓ అతిధిగా పాల్గొన్నాడు. ఊసరవెల్లి చాలా పెద్ద సినిమా, ఈ సినిమా మొత్తానికి దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జీనే కనిపిస్తోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చాలా స్టైలిష్ గా తెరకెక్కించారు అన్నారు రాజమౌళి. ఊసరవెల్లి అంటే ఎన్ని కలర్స్ మారుస్తుందో తెలియదు కానీ..జూ ఎన్టీఆర్ అన్ని రంగుళ్లో ఈ సినిమాలో కనిపించి తను ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు అన్న విషయం ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ ను బయటపెడతాడు అన్నాడు.

    కాగా అతను వేదికపై ప్రసంగిస్తున్నప్పడు జూ ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడూ అని అభిమానులు ప్రశ్నించారు. అందుకు బదులుగా త్వరలోనే ఉంటుంది అన్నట్లు రాజమౌళి చెప్పాడు. కానీ రాజమౌళి చేతిలోంచి జూ ఎన్టీఆర్ మైకు లాక్కుని ఎప్పటికప్పుడు ఇలానే చెబుతున్నాడు. ఇప్పటికిప్పుడు మీరు నిలదియ్యండి..బయట రాజమౌళి గారి కారు ఉంది. ఆ కారుని ఎటాక్ చేసి నాతో ఎప్పుడు సినిమా తీస్తాడో అడగండి అని ఎన్టీఆర్ అన్నాడు.

    English summary
    SS Rajamouli said, “Oosaravelli is a huge film. The audience can watch the complete engegy of Devisri Prasad in Oosaravelli. Tollywood's stylish director Surender Reddy designed this film stylishly. Oosaravelli means it changes the colours. However, the hero of this film once again proved that he can mould himself to any kind of role that he plays. I’m planning a movie with NTR shortly.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X