Jr NTR Fan Shyam death mystery పోస్టు మార్టం రిపోర్టులో సంచలన విషయాలు.. వైసీపీ తప్పుడు ప్రచారం అంటూ ట్రోలింగ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ ఆత్మహత్యా సంఘటన వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒంటి నిండా గాయాలు, చేతికి బలమైన గాయం ఓ పక్క, ఉరి వేసుకొని మరణించడం మరో పక్క వాస్తవాలకు దూరంగా కనిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదాస్పద పోస్టులు శ్యామ్ మరణంపై అనేక సందేహాలు రేకెత్తిస్తున్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిగా భావిస్తున్న కార్యకర్త చేసిన పోస్టు మార్టం రిపోర్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ రిపోర్టు వివరాల్లోకి వెళితే...
కోనసీమ జిల్లా ఎస్పీ పీ శ్రీధర్ చెప్పినట్టుగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త చేసిన పోస్టులో.. జూన్ 25వ తేదీ ఉదయం శ్యామ్ అనే 20 ఏళ్ల యువకుడు కోనసీమ జిల్లాలోని తన గ్రామంలో మరణించాడు.ఆయన మరణం జూన్ 24 రాత్రి 9 గంటల నుంచి 25వ తేదీ ఉదయం 6 గంటల మధ్య జరిగి ఉండవచ్చు. వార్త తెలియగానే ఇన్స్‌పెక్టర్ సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేశారు అని పోస్టులో పేర్కొన్నారు.

శ్యామ్ ఉరి వేసుకొని మరణించినట్టు ప్రాథమికంగా ధృవీకరణ జరిగింది. దాంతో ఈ కేసును ఐపీసీ సెక్షన్ 174 కింద నమోదు చేశాం. మృతుడు ముందుగా బ్లేడ్‌తో చేయి కోసుకొన్నాడు. ఆ తర్వాత ఉరి వేసుకొన్నాడు. అతడి జేబులో దొరికిన బ్లేడ్‌ను స్వాధీనం చేసుకొన్నాం. ఆ తర్వాత అతడి బాడీని పోస్టుమార్టానికి పంపాం అని పోస్టులో పేర్కొన్నారు.

శ్యామ్ దేహంపై ఉన్న ఆనవాళ్లను బట్టి కచ్చితంగా సూసైడ్ అని భావిస్తున్నాం. దర్యాప్తుకు అతడి తల్లిదండ్రులు నిరాకరించకపోవడంతో వారికి శవాన్ని అప్పగించాం. శ్యామ్ మృతి వెనుక కారణాలపై విచారణ చేపట్టాం. త్వరలోనే అని వివరాలు వెల్లడిస్తాం అని కోనసీమ ఎస్పీ చెప్పినట్టు ఓ నెటిజన్ పోస్టు పెటారు.

అయితే వైసీపీ కార్యకర్తగా భావిస్తున్న వ్యక్తి పోస్టులో... ప్రాథమిక విచారణ తర్వాత శ్యామ్‌కు లవ్ అఫైర్ ఉందనే విషయం మా దృష్టికి వచ్చింది. స్టడీస్‌లో కూడా రాణించడం లేదు. అందుకే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటాడేమో. ఈ మృతి ఘటనతో వైఎస్ఆర్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవాలే అని ఎస్పీ చెప్పినట్టు పోస్టు పెట్టారు.
అయితే వైసీపీ కార్యకర్తగా భావిస్తున్న వ్యక్తి పెట్టిన పోస్టుపై ట్రోల్స్ భారీగా కనిపిస్తున్నాయి. శ్యామ్ మరణంపై ఫేక్ ప్రచారం వైసీపీ మొదలుపెట్టింది అంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి. శ్యామ్ మరణం వెనుక నిజాలు బయటకు తీయాలి. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











