Jr NTR ఫ్యాన్ మృతి.. జనసేన సపోర్ట్‌.. అందుకే చంపారంటూ షాకింగ్ ట్వీట్

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విరాభిమాని శ్యామ్ మరణ వార్త సంచలం సృష్టిస్తోంది. శ్యామ్ మరణం ఆత్మహత్య అని వార్తలు రాగా దానిపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ తారక్ అభిమానులు, టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నాయి. శ్యామ్ కు న్యాయం జరగాలంటూ ఇంటర్నెట్ లో హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో శ్యామ్ మరణానికి, జనసేన పార్టీకి సంబంధం ఉందనే ఓ పోస్ట్ షాకింగ్ గా మారింది. అసలు ఆ పోస్టులో ఏముందనే విషయంలోకి వెళితే..

శ్యామ్ బ్యాక్ గ్రౌండ్:నందమూరి ఫ్యామిలీలో మంచి నటన, హావాభావాలు, అదిరిపోయే డ్యాన్సులతో ఎవ్వరినైనా మెప్పించగల సత్తా ఉన్న హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఆయనకు అభిమానులు భారీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొకొల్లలు. అలాంటి వారిలో ఒకరే శ్యామ్. స్టూడెంట్ అయిన శ్యామ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం.

Jr NTR Fan Shyam Death Suspicious By Support Of Janasena Party Tweet Goes Viral

ఉరి వేసుకుని:జూనియర్ ఎన్టీఆర్ కు శ్యామ్ వీరాభిమాని. ఇటీవల విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్ వచ్చినప్పుడు స్టేజ్ పై ఉన్న సెక్యూరిటీని దాటి మరి కలిశాడు. శ్యామ్ ను సెక్యూరిటీ పక్కకు తోసేయబోతే.. వారిని ఎన్టీఆర్ అడ్డుకుని అతనితో ఫొటో దిగాడు. అలాంటి శ్యామ్ ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడన్న వార్తలు కలవరం తెప్పిస్తున్నాయి.

Jr NTR Fan Shyam Death Suspicious By Support Of Janasena Party Tweet Goes Viral

ట్రెండింగ్:శ్యామ్ మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వస్తున్నాయి. #WeWantJusticeForShyamNTR అంటూ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ఏపీ పోలీసులకు, సినీ సెలబ్రిటీలను ట్యాగ్ చేస్తూ శ్యామ్ డెత్ మిస్టరీ వీడేందుకు మద్దతు కోరుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేయించి శ్యామ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Jr NTR Fan Shyam Death Suspicious By Support Of Janasena Party Tweet Goes Viral

బెస్ట్ యాక్టర్ అన్నందుకే:చింతలూరు గ్రామంలో శ్యామ్ మరణించారు. దీనిపై అనేక విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో తాజాగా ఓ ట్వీట్ నెట్టింలో షాక్ కు గురి చేసింది. "శ్యామ్ బ్రో స్టోరీ వింటుంటే ఏడుపొస్తుందిరా. అంత క్రూరంగా చంపేసి ఆత్మహత్యలా నమ్మిస్తున్నారు. జనసేన పార్టీ వాళ్ల సపోర్టుతోనే ఇదంతా చేశారంట. పవన్ కల్యాణ్ కంటే ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అన్నదానికి చంపేశారంట. ఏపీ ప్రజలు ఏం పాపం చేస్తే తగిలావ్ నువ్వు" అని రాసుకొచ్చిన నెటిజన్ పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశాడు.

న్యాయం చేస్తాం:ఈ ట్వీట్ పై మరొక యూజర్ రియాక్ట్ అవుతూ రీట్వీట్ చేశాడు. "వాళ్లు పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు. కానీ అసలైన దోషులు వైసీపీ పార్టీకి చెందినవారే. నువ్ ఇదేరకంగా అతని గురించి ట్వీట్ చేయగలవా?" అని క్వశ్చన్ చేశాడు. ఇలా శ్యామ్ మృతిపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక శ్యామ్ మరణానికి న్యాయం చేస్తామని టీడీపీ పార్టీ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X