జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ అనుమానాస్పద మృతి.. వైఎస్ జగన్ సర్కారును డిమాండ్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని శ్యామ్ ఇకలేరు. అనుమానాస్పద పరిస్థితుల్లో శ్యామ్ మరణించడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నది. ఇటీవల విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ఛీఫ్ గెస్టుగా హాజరైన సమయంలో శ్యామ్ వేదికపై వచ్చి యంగ్ టైగర్‌తో ఫోటో దిగేందుకు ప్రయత్నించాడు. అయితే బాడీ గార్డులు పక్కకు నెట్టి వేయడంతో ఎన్టీఆర్ పిలిచి శ్యామ్‌తో ఫోటో దిగాడు. ఆ వీరాభిమాని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంపై సోషల్ మీడియాలో భారీగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేయించి శ్యామ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శ్యామ్ మరణం వివరాల్లోకి వెళితే...

ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాలేజ్ స్టూడెంట్. ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం. శ్యామ్ చనిపోయిన ప్రదేశం చింతలూరు గ్రామం. చింతలూరు గ్రామంలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయంది.

Jr NTR Fan Shyam

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణంపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. శ్యామ్ ఉరి వేసుకొని మరణించారనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు. దాంతో శ్యామ్ మరణం హత్య, ఆత్మహత్యనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో వందలాది మంది శ్యామ్ మరణం వెనుక వాస్తవాలు బయటకు తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.

శ్యామ్ ఉరి వేసుకొంటే కాళ్లు నేలకు తాకి ఎలా ఉంటాయి? శరీరం మీద, ముక్కు మీద గాయాలు ఎందుకు ఉంటాయి? జేబులో గంజాయి ప్యాకెట్లు ఎందుకు ఉంటే.. ఆ మత్తులో ఉరి ఎలా వేసుకొంటాడు? హ్యాండ్ కట్ చేసుకొంటే అంత నిలకడగా ఎలా ఉరి వేసుకొంటాడు? అనే ప్రశ్నలను సోషల్ మీడియాలో పెడుతున్నారు.

ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణం గుండెకోతకు గురిచేస్తున్నది. సోదరుడి లాంటి శ్యామ్ ఇకలేరంటే నమ్మలేకపోతున్నాం. ఆయనను ఆ పరిస్థితుల్లో చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. ఏపీ పోలీసులు ఈ ఘటనపై నిజాయితీగా విచారణ జరిపి దోషులను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X