తారక్ కటౌట్ కు బలి ఇచ్చి రక్తాభిషేకం చేసిన హార్డ్ కోర్ ఫ్యాన్స్.. పోలీసుల ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్!
నందమూరి తారక రామారావు మనవడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన పేరు చెప్పినా, సినిమాలు వస్తున్నాయని తెలిసినా ఆయన ఫ్యాన్స్ తెగ రచ్చ చేస్తుంటారు. ముఖ్యంగా ఆయన పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటివి వస్తున్నాయంటే ఇక అభిమానులు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. అయితే ఇటీవల వారు చేసిన ఒక అతి కారణంగా రంగంలోకి పోలీసులు దిగాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
పుట్టినరోజు వేడుకలు: మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ తన 40వ పుట్టిన రోజును జరుపుకున్నారు. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు జరిపారు. కేక్ కటింగ్స్, రక్తదాన శిబిరాలు, రోజులకు పండ్లు అందించడం వంటి ఎన్నెన్నో కార్యక్రమాలను చేపట్టారు. అలాగే ఏపీలోని కొంత మంది అభిమానులు చేసిన పనికి అరెస్టయ్యారు. పుట్టిన రోజు వేడకలు జరపడం వల్ల ఎలా అరెస్టయ్యారు అంటారా..?

పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు: కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన పుట్టిన రోజు వేడకులను ఘనంగా నిర్వహించారు. జీ3 థియేటర్ లో అదే రోజు సింహాద్రి సినిమా ప్రదర్శన ఉంది. ఈ క్రమంలోనే ఆయన అభిమానులు తారక్ ఫొటోలతో పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడే రెండు మేకపోతులను బలిచ్చారు. అంతేకాదండోయ్ ఆ మేకలను కట్ చేసిన తర్వాత వచ్చిన రక్తంతో తారక్ కటౌట్ కు రక్తాభిషేకం చేశారు.

వీడియోలు వైరల్ కావడంతో: ఆ తర్వాత మేక మాంసంతో మటన్ కూర చేయించారు. అన్నం కూడా వండించి మధ్యాహ్నం పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు. ఇలా తమ అభిమాన హీరో పుట్టిన రోజు విందును చేశారు. అయితే ఈ తతంగానికి సంబంధించిన దృశ్యాలను చాలా మంది వీడియోలుగా తీశారు. వాటిని నెట్టింట పెట్టారు. అవికాస్తా త్వరగానే వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ విషయం పోలీసులకు కూడా తెలిసింది.

అభిమానులను అరెస్ట్ చేసిన పోలీసులు: దీంతో మేకపోతులను బలి ఇచ్చి.. కటౌట్ కు రక్తాభిషేకం నిర్వహించిన ఎన్టీఆర్ అభిమానులను పోలీసువు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేశారు. ఇలా ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. అయితే ఈ విషయం కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అభిమానం ఆదర్శవంతంగా ఉండాలి కానీ ఇలా ఉండకూడదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక గతంలో కొందరు అయితే కొట్టుకునే వరకు చంపుకునే వరకు వెళ్లడం షాక్ కు గురి చేసింది. అయితే ఫ్యాన్స్ ఎవరైనా అలా చేస్తే అస్సలు తమకు నచ్చదు అని ఏ హీరో అయినా సరే ఫ్యాన్స్ హద్దులు దాటితే ఇష్టం ఉండదని ఎన్టీఆర్ తో పాటు మరికొందరు హీరోలు అన్నారు.


Click it and Unblock the Notifications











