వెంకట్ రెడ్డిపై జూ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫిర్యాదు
గ్రేట్ఆంధ్రా.కామ్ వెబ్ సైట్ నిర్వాహకుడు వెంకట్ రెడ్డిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, సినీ నటులు శివాజీ, నారా రోహిత్ శుక్రవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ హీరోపై అసభ్య కథనాలు తన వెబ్ సైట్ లో పబ్లిష్ చేసినందుకు గాను ఈ ఫిర్యాదు చేసినట్లు జూనియర్ అభిమానులు ఓ టీవీ ఛానల్ కు వెల్లడించారు. ఈ వ్యవహారంపై హీరో శివాజీ ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ....అది గ్రేట్ఆంధ్రా.కామ్ కాదని బూతు ఆంధ్రా అని హీరో ఆరోపించారు. వెంకట్ రెడ్డి జర్నిలిస్టు కాదని, ఓ పిచ్చోడని మండి పడ్డారు. ప్రముఖలను బ్లాక్ మెయిల్ చేసే వాడని ఆరోపించారు. తాను ఎన్నారైని అంటూ వెంకట్ రెడ్డి విర్రవీగుతుండేవాడని, అతని ఆచూకి కోసం రెండు సార్లు అమెరికా కూడా వెళ్లానని శివాజీ చెప్పుకొచ్చారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్లు నిర్వహిస్తున్న వెబ్ సైట్లను బ్యాన్ చేయాలని శివాజీ డిమాండ్ చేశారు.
గ్రేట్ఆంధ్రా.కామ్ పై ఇప్పటికే మూడు ఫిర్యాదులు అందాయని, ఆ వెబ్ సైట్ పై తగిన చర్యలు తీసుకుంటామని సీసీఎస్ డీసీపీ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. కాగా... కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కీ పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఓ అసత్య కథనం తన వెబ్ సైట్ లో పబ్లిష్ చేసినందుకు గాను ఇప్పటికే వెంకట్ రెడ్డిని పోలీసులు బెంగుళూరులో అరెస్టు చేశారు.


Click it and Unblock the Notifications











