బాలయ్య వర్సెస్ తారక్ కొత్త కాంట్రవర్సీ.. బతుమాలుకుంటున్న నిర్మాత
ఇటీవల తెలుగు సినిమాకి సంబంధించి చాలా మంది హీరోలు అలాగే ఇతర టెక్నీషినల్ కి సంబంధించి పలు అంశాల్లో ఊహించని కాంట్రవర్సీ వార్తలు ఏ రేంజ్ లో ఈ కొన్ని నెలలు చర్చలకి దారి తీశాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా వీటిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వర్సెస్ మెగా కుటుంబ గొడవలు ఒకటైతే అవి కాకుండా మళ్ళీ పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన రచ్చ ఇంకా జానీ మాస్టర్ అని ఇలా చాలా మంది ప్రముఖుల అంశాలు సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున హైలైట్ అయ్యాయి.
కాగా వీటికి ముందు నుంచే ఎన్నో దశాబ్దాల పాటుగా ఉన్న కాంట్రవర్సీ ఏదన్నా ఉంది అంటే అది నందమూరి కుటుంబం నుంచే బాలయ్య అండ్ యువ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ల కోసమే అని చాలా మంది చెబుతూ ఉంటారు. కాగా ఈ ఇష్యూని మెగా అండ్ అల్లు కుటుంబ అభిమానుల గొడవలు ఓ రేంజ్ లో డామినేట్ చేసాయి అనుకుంటే ఇపుడు ఊహించని విధంగా మళ్ళీ నందమూరి హీరోలు అండ్ అభిమానుల నడుమ కొత్త చిచ్చు స్టార్ట్ అయ్యింది.

బాలయ్య, ఎన్టీఆర్ ల నడుమ భేదాభిప్రాయాలు ఎప్పుడు నుంచో ఉన్నాయని అందరికీ తెలిసిందే. కాగా చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ విషయంలో బాలయ్య నుంచి కనిపించిన చర్యలు కూడా ఓ రేంజ్ లో చర్చకు దాటి తీసేవి. కాగా లేటెస్ట్ బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ఓ ఓటిటి టాక్ షోలో ఎన్టీఆర్ కోసం టాపిక్ లేకుండా బాలయ్య దాటవేయడం అనేది ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల అహాన్ని మళ్ళీ దెబ్బ తీసింది.
ఇలా బాలయ్య తమ అభిమాన హీరోని ఎన్నిసార్లు అవమానించే విధంగా చూస్తారు అంటూ సోషల్ మీడియాలో మళ్ళీ బాలయ్య అండ్ తారక్ అభిమానుల నడుమ గొడవలు మొదలయ్యాయి. కాగా ఇది ఇపుడు బాలయ్య నుంచి రానున్న భారీ చిత్రం "డాకు మహారాజ్" పై ఎఫెక్ట్ పడుతుంది అని క్లియర్ అయ్యింది.

ఇన్ని రోజులు ఇద్దరి హీరోల సినిమాలు ఇద్దరు హీరోల అభిమానులు కలిపే చూసారు కానీ ఇపుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డాకు మహారాజ్ కి వ్యతిరేకం కావడంతో ఈ ఇద్దరు హీరోలని ఎంతగానో అభిమానించే నిర్మాత అలాగే ఇపుడు బాలయ్య డాకు మహారాజ్ నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ తారక్ ఫ్యాన్స్ ని బతిమాలుకుంటున్నారు. ఇది మన అందరి సినిమా అంటూ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి అని అర్థిస్తూ పోస్ట్ చేశారు.
దీనితో తారక్ అభిమానులు చాలా మంది ససేమిరా కుదరదని కామెంట్స్ నాగవంశీ విషయంలో చేస్తున్నారు. ఇలా మళ్ళీ ఊహించని విధంగా బాలయ్య సినిమాపై నెగిటివ్ ఎఫెక్ట్ మొదలు కావడం షాకింగ్ గా మారింది. కాగా ఇది నిజంగానే డాకు మహారాజ్ వసూళ్లకు ఎఫెక్ట్ కొడుతుందా లేదా అనేది కూడా చూడాలి. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











